ఒట్టావా: కెనడా మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఇక్కడి న్యూబ్రున్స్‌విక్ ప్రావిన్సులోని ఫ్రెడెరిక్టన్ సిటీలో ఓ దుండుగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు. నిందితుడు శుక్రవారం ఉదయం 7 గంటలకు(స్థానిక కాలమానం ప్రకారం) బ్రూక్‌సైడ్ డ్రైవ్‌లో తన అపార్ట్‌మెంట్ కిటికీ నుంచి కోర్టు ప్రాంగణంపైకి తుపాకీతో కాల్పులు జరిపాడు.
దీంతో ఇద్దరు పోలీస్ అధికారులతో పాటు మరో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ముందుగా దుండగుడు దాక్కున్న అపార్ట్‌మెంట్‌ను చుట్టుముట్టారు. బ్రూక్‌సైడ్ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటకు రావొద్దనీ, ఆపరేషన్ కొనసాగుతోందని ట్విట్టర్‌లో హెచ్చరించారు. గంట తర్వాత ఓ నిందితుడ్ని అరెస్ట్ చేశామని, పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ నిందితుడికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment