
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు-వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు.
వరంగల్ : వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు-వ్యాన్ ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. విద్యాశాఖ రిటైర్డ్ ఏఈ భాస్కర్ కుటుంబసభ్యులతో వరంగల్ నుంచి కారులో హైదరాబాద్ వెళ్తుండగా... స్టేషన్ ఘన్‌పూర్ వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. మృతులను కొంగరి భాస్కర్, గోపిగా గుర్తించారు. మృతులంతా హన్మకొండ మండలం భీమారానికి చెందిన వారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.