టర్కీలోని డియార్‌బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది.
డియార్‌బాకిర్:
టర్కీలోని డియార్‌బాకిర్ నగరంలో గురువారం కారుబాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు పోలీసు అధికారులు మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్, టర్కీ సాయుధ బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కారు బాంబు పేల్చినట్టు సమాచారం.