
సేలం: కావేరి నదిలో స్నానానికి వెళ్లి నలుగురు నీట మునిగి మృతి చెందగా ఒక బాలుడు గల్లంతయ్యాడు. తమిళనాడులోని సేలం జిల్లాలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. మెట్టూరు సమీపంలోని కోల్‌నాయకన్ పట్టి గ్రామానికి చెందిన వాణిశ్రీ (19), ధనుశ్రీ (16)తోపాటు తిరుప్పూర్ జిల్లా విజయమంగళంనకు చెందిన శరవణన్ (35), ఆయన భార్య మైథిలి (32), కుమారుడు హరిహరన్ (9), రవినా (15) కావేరి నదిలో స్నానానికి దిగి మునిగిపోయారు. స్థానికులు ధనుశ్రీని మాత్రమే కాపాడగలిగారు. గజ ఈతగాళ్ల సాయంతో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. హరిహరన్ కోసం ఆదివారం సాయంత్రం వరకు గాలించినా ఫలితం లేకపోయింది.