
మిన్నెపొలిస్: అమెరికాలోని మిన్నెపొలిస్‌లో శనివారం తెల్లవారు జామున జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ముగ్గురు గాయపడ్డారు. డౌన్‌టౌన్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
క్షతగాత్రుల్లో ముగ్గురు యువతులున్నారని, వీరెవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఘటన నేపథ్యంలో హెన్నెపిన్ కౌంటీ, మెట్రో ట్రాన్సిట్ పోలీసులతో కలిసి గస్తీ పెంచినట్లు చెప్పారు.