Ashes 2023: Several Records Broken By Australia Victory In 1st Test Vs England - Sakshi
Sakshi News home page

#Ashes2023: చావుదెబ్బ కొట్టిన ఆసీస్‌.. రికార్డులు బద్దలైన వేళ

Published Wed, Jun 21 2023 8:58 AM | Last Updated on Wed, Jun 21 2023 9:16 AM

Several Records Broken By AUS Wins 1st Test Vs ENG Ashes 2023 - Sakshi

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా మంగళవారం ముగిసిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆట ఆఖరిరోజు వరుణుడు అడ్డుపడడం.. ఆ తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడం మ్యాచ్‌ను ఆ జట్టువైపు తిప్పింది. అయితే చివరి సెషన్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌, నాథన్‌ లియోన్‌లు వీరోచిత పోరాటం ఆసీస్‌ను గెలుపు దిశగా నడిపించింది. బజ్‌బాల్‌ అంటూ దూకుడు మీదున్న ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టి పలు రికార్డులను ఆసీస్‌ తన పేరిట లిఖించుకుంది. అవేంటో పరిశీలిద్దాం.

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టుల్లో 275 అంతకంటే ఎక్కువ టార్గెట్‌ను చేధించడం ఇది 15వ సారి కాగా.. ఈ ఏడాదే ఐదుసార్లు ఉండడం గమనార్హం

► ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చిన విదేశీ జట్లు అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఇది ఐదోసారి. ఇంతకముందు 1948లో హెడ్డింగేలో ఆస్ట్రేలియా 404 పరుగుల టార్గెట్‌ను, 1984లో లార్డ్స్‌ వేదికగా వెస్టిండీస్‌ 342 పరుగుల టార్గెట్‌ను, 2017లో హెడ్డింగే వేదికగా వెస్టిండీస్‌ 322 పరుగుల టార్గెట్‌ను, 2008లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా సౌతాఫ్రికా 281 పరుగుల టార్గెట్‌ను చేధించాయి.

► ఇక టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్లలో బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 80 పరుగులతో పాటు బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా కమిన్స్‌ నిలిచాడు. ఇంతకముందు బాబ్‌ సింప్సన్‌ నాలుగుసార్లు, జార్జ్‌ గిఫెన్‌ రెండుసార్లు, వార్విక్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, రిచీ బెర్నాడ్‌, అలెన్‌ బోర్డర్‌, పాట్‌ కమిన్స్‌ తలా ఒకసారి ఈ ఘనత సాధించారు.

► టెస్టుల్లో చేజింగ్‌ సందర్భాల్లో తొమ్మిదో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన నాలుగో జంటగా పాట్‌ కమిన్స్‌-నాథన్‌ లియోన్‌ నిలిచారు. ఈ ద్వయం ఇంగ్లండ్‌తో టెస్టులో తొమ్మిదో వికెట్‌కు 55 పరుగులు జోడించారు. ఇక తొలి స్తానంలో 81 పరుగులు - వీవీఎస్‌ లక్ష్మణ్ & ఇషాంత్ శర్మ (IND) vs AUS, మొహాలి, 2010; 61* పరుగులు - జెఫ్ డుజోన్ & విన్‌స్టన్ బెంజమిన్ (WI) vs PAK, బ్రిడ్జ్‌టౌన్, 1988; 56* పరుగులు - టిబ్బి కాటర్ & గెర్రీ హాజ్లిట్ (AUS) vs ENG, సిడ్నీ, 1907; 55* పరుగులు - పాట్ కమ్మిన్స్ & నాథన్ లియోన్ (AUS) vs ENG, ఎడ్జ్‌బాస్టన్, 2023 ; 54 పరుగులు - బ్రియాన్ లారా & కర్ట్లీ ఆంబ్రోస్ (WI) vs AUS, బ్రిడ్జ్‌టౌన్, 1999 ఉన్నారు.

► ఒక టెస్టులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆస్ట్రేలియా కెప్టెన్లలో పాట్‌ కమిన్స్‌ చోటు సంపాదించాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో కమిన్స్‌ ఐదు సిక్సర్లు కొట్టాడు. ఇంతకముందు రికీ పాంటింగ్‌ 2005లో న్యూజిలాండ్‌పై ఐదు సిక్సర్లు, ఇయాన్‌ చాపెల్‌ 1972లో పాకిస్తాన్‌పై నాలుగు సిక్సర్లు కొట్టాడు.

► యాషెస్‌ చరిత్రలో అత్యధిక పరుగుల టార్గెట్‌ను చేధించడం ఆస్ట్రేలియాకు ఇది ఐదోసారి. ఇంతకముందు 404 పరుగుల టార్గెట్‌ను 1948లో హెడ్డింగే వేదికగా, 315 పరుగుల టార్గెట్‌ను అడిలైడ్‌ వేదికగా 1901-02లో, 286 పరుగుల టార్గెట్‌ను మెల్‌బోర్న్‌ వేదికగా 1928-29లో, తాజాగా ఎడ్జ్‌బాస్టన్‌లో(2023లో) 281 పరుగుల టార్గెట్‌ను, 1897-98లో సిడ్నీ వేదికగా 275 పరుగుల టార్గెట్‌ను చేధించింది.

► యాషెస్‌ చరిత్రలో ఇది ఆరో క్లోజెస్ట్‌ విజయం. ఇంతకముందు ఇంగ్లండ్‌ మూడు సందర్భాల్లో ఒక వికెట్‌ తేడాతో, ఒకసారి రెండు వికెట్ల తేడాతో విజయం సాధించగా.. ఆస్ట్రేలియా రెండు సందర్బాల్లో రెండు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

చదవండి: బజ్‌బాల్‌ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement