బర్మింగ్‌హామ్: ప్రస్తుత వరల్డ్‌కప్‌లో తొలి ఓటమి.. విజయ్ శంకర్ గాయం.. ఓపెనర్ రాహుల్ ఫిట్‌నెస్‌పై ఆందోళన నేపథ్యంలో భారత జట్టు ఒకరోజు వ్యవధిలోనే మరో మ్యాచ్‌కు సిద్ధమైంది. సెమీఫైనల్లో ప్రవేశానికి మరో మ్యాచ్ దూరంలో ఉన్న టీమిండియా మంగళవారం బంగ్లాదేశ్‌తో పోరుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరోమాట లేకుండా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గుచూపాడు. భారత్ తుది జట్టులో భువనేశ్వర్ కుమార్ తిరిగి చోటు దక్కించుకోగా, కుల్దీప్ యాదవ్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఇక దినేశ్ కార్తీక్ కూడా భారత్ ఎలెవన్ జట్టులో చోటు సంపాదించాడు. కేదార్ జాదవ్‌ను తప్పించి దినేశ్ కార్తీక్‌కు అవకాశం కల్పించారు.
టీమిండియా ప్రస్తుతం 11 పాయింట్లతో ఉంది. అటు బంగ్లా ఏడు పాయింట్లతో ఉంది. ఈ జట్టు నాకౌట్ రేసులో ఉండాలంటే ఈ మ్యాచ్‌తో పాటు పాక్‌పైనా నెగ్గాలి. కాబట్టి తమ శాయశక్తులా పోరాటానికి సిద్ధమవుతోంది. మరొకవైపు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత్ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో పాటు బ్యాట్స్‌మెన్ నుంచి కూడా ఆశించిన ప్రదర్శన కనబడలేదు. దాంతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని భారత్ భావిస్తోంది.
సీనియర్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్‌పైనే బంగ్లా సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతూ 476 పరుగులు, 10 వికెట్లతో అతడు అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. భారత్‌పై అతడి జోరుపైనే జట్టు ఫలితం ఆధారపడి ఉంది. అలాగే ముష్ఫికర్ రహీమ్ కూడా ఓ శతకం, రెండు హాఫ్ సెంచరీలతో సత్తాచాటాడు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ కూడా రాణించగలిగితే జట్టు భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. ఒక్క బౌలింగ్‌లోనే ఈ జట్టు చాలా వీక్‌గా కనిపిస్తోంది. పేస్‌లో ముస్తాఫిజుర్, స్పిన్‌లో షకీబల్ మీదే ఎక్కువగా ఆధారపడుతోంది. ఇరు జట్లు ముఖాముఖి పోరులో 35 వన్డేల్లో తలపడగా భారత్ 29 మ్యాచ్‌ల్లో గెలవగా, బంగ్లాదేశ్ 5 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. వరల్డ్‌కప్ ముఖాముఖి పోరులో ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లు మూడు కాగా భారత్ రెండు గెలిచింది. మరొకదాంట్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
భారత్
విరాట్ కోహ్లి(కెప్టెన్), కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, బుమ్రా, చహల్
బంగ్లాదేశ్
మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, షకీబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, లిటాన్ దాస్, మొసదెక్ హుస్సేన్, షబ్బీర్ రహ్మాన్, మహ్మద్ సైఫుద్దీన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్
Comments
Please login to add a commentAdd a comment