
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ దుమ్మురేపుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ ఆది నుంచి ఎదురుదాడికి దిగింది. ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టోలు బౌండరీలే లక్ష్యంగా చెలరేగి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ హాఫ్ సెంచరీలను అవలీలగా సాధించారు. ఇంగ్లండ్ ఓపెనర్ల దూకుడుకు ఆ జట్టు 20 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 145 పరుగులు చేసింది. ఇదే జోరు కడవరూ కొనసాగితే ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించడం ఖాయం.
మరొకవైపు ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని జోడిగా జేసన్ రాయ్-బెయిర్ స్టోలు నిలిచారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు వరకూ ఏ జట్టు కూడా భారత్‌పై వంద పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాధించలేదు. ఇప్పటివరకూ ఆసీస్ జోడి డేవిడ్ వార్నర్-అరోన్ ఫించ్‌లు చేసిన 61 పరుగులే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా, దాన్ని ఇంగ్లండ్ సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment