‘మరీ ఇంత సింపుల్‌గానా.. గ్రేట్‌’ | World Cup 2019 Morgan Took Train To Birmingham Ahead Semis | Sakshi
Sakshi News home page

‘మరీ ఇంత సింపుల్‌గానా.. గ్రేట్‌’

Published Sat, Jul 13 2019 6:47 PM | Last Updated on Sat, Jul 13 2019 6:47 PM

World Cup 2019 Morgan Took Train To Birmingham Ahead Semis - Sakshi

లండన్‌: మీడియా హడావుడి లేదు. అభిమానుల తాకిడి లేదు. ఒంటరిగా.. ప్రశాంతంగా, ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకుండా సాధారణ రైలు ప్రయాణం చేశాడు ఇంగ్లండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌. ప్రపంచకప్‌ సెమీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ కోసం బర్మింగ్‌హామ్‌కు మోర్గాన్‌ సాధారణ వ్యక్తిలా చేరుకున్నాడు. ప్రస్తుతం క్రికెట్‌ ఫీవర్‌ పీక్‌స్థాయిలో ఉండగా అందులోనూ ఇంగ్లండ్‌ను సెమీస్‌కు చేర్చిన సారథి అంత సింపుల్‌గా ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం మోర్గాన్‌కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్‌ చేస్తున్నారు.

‘మరీ ఇంత సింపుల్‌గానా.. గ్రేట్‌’, ‘ఇంగ్లండ్‌కు తొలిసారి కప్‌ అందించే సారథిని ఎవరూ గుర్తుపట్టలేదా..చిత్రంగా ఉందే?’, ‘మోర్గాన్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ తలరాతే మారిపోయింది.. కానీ గుర్తింపే రాలేదు’అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక గతంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి కూడా తనకు ప్రైవేట్‌గా బతకడమంటేనే ఇష్టమని పేర్కొన్నాడు. భారత్‌లో సెలబ్రిటీగా జీవించడం చాలా కష్టమని.. ఎక్కువ ఫ్రీడమ్‌ ఉండదన్నాడు. అందుకే వీలుచిక్కినప్పుడల్లా అనుష్కతో కలిసి విదేశాలకు పయనమవుతానని వివరించాడు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా ఫైనల్‌ పోరులో న్యూజిలాండ్‌తో ఇంగ్లండ్‌ తలపడనుంది. ఫైనల్లో  ఆతిథ్య జట్టు గెలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌ అందించిన తొలి సారథిగా మోర్గాన్‌ రికార్డు సృష్టిస్తాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement