
భారత క్రికెటర్ల ఫైల్‌ఫొటో
బర్మింగ్‌హామ్: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలు సాధిస్తూ మంచి జోరు మీద ఉన్న భారత క్రికెట్ జట్టు.. ఇంగ్లండ్‌పైనే గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకోవాలని యోచిస్తోంది. కాగా, మ్యాచ్‌కు ముందు ఓ ఘటన భారత క్రికెటర్లను ఆందోళన పరిచింది. బర్మింగ్‌హామ్‌లో భారత క్రికెటర్లు బస చేసిన హోటల్ రూమ్ వద్ద కలకలం రేగింది. ఆటగాళ్ల రూమ్‌కు అత్యంత సమీపంలోని హ్యాట్ రెజెన్సీలోకి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి అందర్నీ టెన్షన్ పెట్టారు.
టెలీగ్రాఫ్ కథన ప్రకారం శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ప్రైవసీని భగ్నం చేసేలా ఆ ముగ్గురు వ్యక్తులు అనుచితంగా ప్రవర్తించారు. ఆటగాళ్ల గదుల దగ్గర తిరుగుతూ, వాళ్ల కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తీశారు. దీనిపై ఆగ్రహించిన ఆటగాళ్లు మేనేజ్‌మెంట్‌కు విషయం తెలపగా.. హోటల్ యాజమాన్యాన్ని మేనేజ్‌మెంట్ నిలదీసింది. ముగ్గురు అతిథులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని యాజమాన్యం పేర్కొంది. హోటల్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఐసీసీ అదనంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీ కూడా ఉండగా ఆ ముగ్గరు ఇలా ప్రవర్తించడం ఆందోళన రేకెత్తించింది.
Comments
Please login to add a commentAdd a comment