లండన్ :
యునైటెడ్ కింగ్‌డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్త) ఆధ్యరంలో 'జయతే కూచిపూడి 2017' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యూకే - ఇండియా కల్చర్ ఆఫ్ ది ఇయర్‌లో భాగంగా యూకేలోని బర్మింగ్‌హామ్‌లోని ప్రముఖ బాలాజీ దేవస్థానంలో ఈ వేడుకలు జరిగాయి. భారత దేశం నుంచి వచ్చిన డా.జ్వాలా శ్రీకళ బృందం ఇచ్చిన అన్నమాచార్య కీర్తన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
సుమారు 500లకి పైగా భారతీయ ప్రేక్షకులు పాల్గొని భారతదేశ కూచిపూడి నాట్య ప్రదర్శనలను చూసి సంతోషించారు. ఈ బృందం యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాంచెస్టర్, బ్రాడ్ఫోర్డ్, లండన్ నగరాలలో ఈనెల ప్రదర్శనలు చేయనున్నారు. డా. కనగరత్నం, బాలాజీ దేవస్థాన చైర్మన్ మన భారత దేశ కళలను దేవస్థాన సన్నిధానంలో చేయడాన్ని కొనియాడారు. దేవస్థాన నిర్వాహకులు కామాక్షి, యుక్త కమిటీ సభ్యులు ప్రసాద్ మంత్రాల, అమర్ రెడ్డి, రుద్రా వర్మ బట్ట, కార్తీక్ గంటి, పూర్ణిమ రెడ్డి చల్ల ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.