న్యూఢిల్లీ: భారత టీనేజ్ బ్యాటర్ షఫాలీ వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో తొలి సారి నిర్వహించనున్న ‘హండ్రెడ్’ టోర్నీలో ఆమె పాల్గొననుంది. బర్మింగ్‌హామ్ ఫోనిక్స్ జట్టుకు షఫాలీ ప్రాతినిధ్యం వహిస్తుంది. న్యూజిలాండ్ దిగ్గజం సోఫీ డివైన్ స్థానంలో చివరి నిమిషంలో ఆమెకు అవకాశం దక్కింది.
బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఈ టోర్నీలో పాల్గొనేందుకు ఇప్పటికే హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మలకు బీసీసీఐ ఎన్‌ఓసీ మంజూరు చేసింది. భారత్‌నుంచి నాలుగో ప్లేయర్‌గా షఫాలీ బరిలోకి దిగనుంది.
ప్రస్తుతం ఐసీసీ టి20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో ఉన్న ఈ హరియాణా అమ్మాయికి ఆస్ట్రేలియాలో జరిగే ఉమెన్ బిగ్‌బాష్ లీగ్‌లో కూడా ఆడేందుకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. భారత్ తరఫున 22 టి20లు ఆడిన షఫాలీ...148.31 స్ట్రైక్‌రేట్‌తో 617 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment