
రోత్సె క్లాసిక్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో మూడో సీడ్ సానియా మీర్జా (భారత్)–లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జంట శుభారంభం చేసింది. బర్మింగ్‌హమ్‌లో సోమవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సానియా–లూసీ హర్డెస్కా ద్వయం 7–5, 6–2తో అలీసియా బార్నెట్–ఒలీవియా నికోల్స్ (బ్రిటన్) జోడీపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా జంట ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి తమ సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
చదవండి: World Youth Weightlifting Championship: భళా గురు...
Comments
Please login to add a commentAdd a comment