Breadcrumb
- HOME
IND vs WI 2nd T20I: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. రెండో టీ20 అప్డేట్స్
Published Fri, Feb 18 2022 6:29 PM | Last Updated on Fri, Feb 18 2022 6:52 PM
Live Updates
ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. రెండో టీ20 అప్డేట్స్
ఉత్కంఠ భరిత పోరులో విండీస్‌పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
చివర వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో విండీస్‌పై భారత్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టీ20 సిరీస్‌ను 2-0తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఇక హర్షల్ పటేల్ వేసిన అఖరి ఓవర్లో 24 పరుగులు అవసరం కాగా విండీస్ 16 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో పావెల్(68) చివరి వరకు పోడాడు.
విండీస్ బ్యాటర్లలో పూరన్(62), పావెల్(68) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక భారత బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, బిష్ణోయ్ చెరో వికెట్ సాధించారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా.. బ్యాటర్లు చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పంత్ అర్ధ సెంచరీలతో మెరిశారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడుగా ఆడాడు. 41 బంతుల్లో కోహ్లి 52 పరుగులు సాధించాడు. ఇక చివరలో పంత్, వెంకటేశ్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించారు. పంత్ కేవలం 28 బంతుల్లో 58 పరుగులు సాధించగా, అయ్యర్ 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇక విండీస్ బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
గెలుపు దిశగా భారత్.. పూరన్ ఔట్
విజయం దిశగా టీమిండియా అడుగులు వేస్తోంది. ఫామ్‌లో ఉన్న పూరన్ వికెట్‌ను విండీస్ కోల్పోయింది. అఖరి ఓవర్లో విండీస్ విజయానికి 25 పరుగులు కావాలి. క్రీజులో పొలార్డ్, పావెల్ ఉన్నారు.
విజయం దిశగా విండీస్..
భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విండీస్ విజయం దిశగా అడుగులు వేస్తోంది. విండీస్ విజయానికి 18 బంతుల్లో 37 పరుగులు కావాలి. క్రీజులో పూరన్, పావెల్ ఉన్నారు.
భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న విండీస్.. 15 ఓవర్లకు స్కోర్: 124/2
విండీస్ బ్యాటర్లు పూరన్, పావెల్ భారత బౌలర్లపై విరుచుకు పడుతున్నారు. 15 ఓవర్ల ముగిసే సరికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 124 పరుగులు సాధించింది. పావెల్(33), పూరన్(47) పరుగులతో క్రీజులో ఉన్నారు. విండీస్ విజయానికి 30 బంతుల్లో 63 పరుగులు కావాలి.
దూకుడుగా ఆడుతున్న విండీస్.. 13 ఓవర్లకు స్కోర్: 103/2
విండీస్ బ్యాటర్లు పూరన్, పావెల్ దూకుడుగా ఆడుతున్నారు. 13 ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 103 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(41),పావెల్(21) పరుగులతో ఉన్నారు.
రెండో వికెట్ కోల్పోయిన విండీస్.. కింగ్ (22) ఔట్
59 పరుగుల వద్ద కింగ్ రూపంలో విండీస్ రెండో వికెట్ కోల్పోయింది. 22 పరుగుల చేసిన కింగ్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో సూర్యకూమార్ యాదవ్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు ముగిసే సరికి విండీస్ 73 పరుగులు చేసింది. క్రీజులో పూరన్, పావెల్ ఉన్నారు.
6 ఓవర్లకు విండీస్ స్కోర్: 54/1
6 ఓవర్లు ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. క్రీజులో కింగ్(20), పూరన్(21) పరుగులతో ఉన్నారు.
తొలి వికెట్ కోల్పోయిన విండీస్.. మైర్స్ ఔట్
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన మైర్స్ చాహల్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 6 ఓవర్లు ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో కింగ్(19), పూరన్ (6) పరుగులతో ఉన్నారు.
4 ఓవర్లకు విండీస్ స్కోర్: 28/0
4 ఓవర్లు ముగిసే సరికి విండీస్ వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో కింగ్(12),మైయర్స్ (8) పరుగులతో ఉన్నారు.
2 ఓవర్లకు విండీస్ స్కోర్: 14/0
186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 2 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 14 పరుగులు చేసింది. క్రీజులో కింగ్(7), మైర్స్(1) పరుగులతో ఉన్నారు
చేలరేగిన భారత బ్యాటర్లు.. విండీస్ టార్గెట్ 186 పరుగులు
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా బ్యాటర్లు చేలరేగి ఆడారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లి, పంత్ అర్ధ సెంచరీలతో మెరిశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే కిషన్ వికెట్ కోల్పోయింది.
తర్వాత కోహ్లి, రోహిత్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి ఆది నుంచే దూకుడుగా ఆడాడు. 41 బంతుల్లో కోహ్లి 52 పరుగులు సాధించాడు. ఇక చివరలో పంత్, వెంకటేశ్ అయ్యర్ బౌండరీల వర్షం కురిపించారు. పంత్ కేవలం 28 బంతుల్లో 58 పరుగులు సాధించగా, అయ్యర్ 18 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇక విండీస్ బౌలర్లలో ఛేజ్ మూడు వికెట్లు పడగొట్టాడు.
నాలుగో వికెట్ డౌన్.. విరాట్ కోహ్లి ఔట్..
అర్ధ సెంచరీ చేసిన వెంటనే విరాట్ కోహ్లి ఔటయ్యాడు. 52 పరుగులు చేసిన కోహ్లి ఛేజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది.
చెలరేగిన విరాట్ కోహ్లి.. 39 బంతుల్లోనే
విండీస్‌తో జరుగుతున్న రెండో టీ20లో విరాట్ కోహ్లి అర్ధసెంచరీతో మెరిశాడు. 39 బంతుల్లో 52 అర్ధ సెంచరీ సాధించాడు. 52 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్.. సూర్యకూమార్ యాదవ్ ఔట్
టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. కేవలం 8 పరుగులు చేసిన సూర్యకూమార్ యాదవ్.. ఛేజ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లకు భారత్ స్కోర్: 76/3
రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా.. రోహిత్(19) ఔట్
59 పరుగుల వద్ద టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. 19 పరుగులు చేసిన రోహిత్.. ఛేజ్ బౌలింగ్‌లో కింగ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 60 పరుగులు చేసింది.
దూకుడుగా ఆడుతున్న కోహ్లి.. 6 ఓవర్లకు భారత్ స్కోర్: 49/1
కిషన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లి దూకుడుగా ఆడుతున్నాడు. 14 బంతుల్లో 5 ఫోర్లతో 23 పరుగులు చేశాడు. మరో వైపు రోహిత్ కూడా నిలకడగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 49 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్(17),కోహ్లి(23) పరుగులతో ఉన్నారు.
4 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్: 23/1
నాలుగు ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది. క్రీజులో విరాట్(8), రోహిత్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా కాట్రెల్ బౌలింగ్‌లో రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను కింగ్ వదిలి వేయడంతో బతికిపోయాడు.
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా.. కిషన్ ఔట్
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్ ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. కేవలం 2 పరుగులు మాత్రమే చేసి కాట్రెల్ బౌలింగ్‌లో మైర్స్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 2 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 10 పరుగులు చేసింది.
తుది జట్లు ఇవే
భారత తుది జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, యజువేంద్ర చహల్
వెస్టిండీస్ తుది జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయెర్స్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), పావెల్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, ఓడియన్ స్మిత్, అకీల్ హొసేన్, షెల్డన్ కాట్రెల్,జాసన్ హోల్డర్
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విండీస్
స్వదేశంలో వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్‌పై కన్నేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో టీ20లో విండీస్‌తో తలపడడానికి భారత్ సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి విండీస్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా, విండీస్ ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫాబియాన్ అలెన్ స్ధానంలో జాసన్ హోల్డర్ జట్టులోకి వచ్చాడు.
Related News By Category
Related News By Tags
-
భారీ రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్.. మూడేస్తే రోహిత్, విరాట్ సరసన చోటు
విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్ 6) జరుగనున్న రెండో టీ20కి ముందు టీమిండియా చిచ్చరపిడుగు, వరల్డ్ టీ20 నంబన్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను ఓ భారీ రికార్డు ఊరిస్తుంది. నేటి మ్యాచ్‌లో స్కై మరో 3 సిక్సర్లు...
-
IND VS WI 1st ODI: భారీ రికార్డులపై కన్నేసిన హిట్‌మ్యాన్, కోహ్లి
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు భారీ రికార్డులపై కన్నేశారు. హిట్‌మ్యాన్ మరో 175 పరుగులు చేస్తే వన్డేల్లో 10,000 పరుగుల మైల...
-
Ind vs WI: రెండో టెస్టుకు సిద్ధం.. ట్రినిడాడ్‌లో టీమిండియా! కళ్లన్నీ ఆ ఇద్దరిపైనే!
West Indies vs India, 2nd Test: వెస్టిండీస్‌తో తొలి టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన టీమిండియా రెండో మ్యాచ్‌కు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో రోహిత్ సేన మ్యాచ్ వేదిక పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌కు చేరుకుంది....
-
రోహిత్ శర్మకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం.. ఏంటంటే..?
వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ (171), రోహిత్ శర్మ (103) సెంచరీతో కదంతొక్కగా.. 12 వికెట్లతో అశ్విన్ చెలరేగి...
-
రోహిత్‌కు రెస్ట్.. కెప్టెన్‌గా హార్ధిక్.. మరో కొత్త ఓపెనింగ్ జోడీతో ప్రయోగం
అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా వెస్టిండీస్ జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా భారీ ప్రయోగాలకు పూనుకుంది. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1తో కైవసం చేసుకోవడంతో జట్టు యాజమాన్యం ఈ మేరకు నిర్ణయించినట్...
Comments
Please login to add a commentAdd a comment