Courtesy: IPL Twitter
ముంబై: సీఎస్‌కేతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దుమ్ములేపిన కేకేఆర్ చివరకు పరాజయంతో సరిపెట్టుకుని షాక్‌లో ఉంటే ఇప్పుడు మరో షాక్ తగిలింది. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ నమోదు చేయడంతో మోర్గాన్‌కు రూ. 12లక్షల ఫైన్ విధించారు. ఇది కేకేఆర్ తొలి ఉల్లంఘన కావడంతో ఆ జట్టు కెప్టెన్ మోర్గాన్ ఫీజులో రూ. 12లక్షలను కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. దాంతో ఈ సీజన్‌లో ఇప్పటివరకూ జరిమానా పడ్డ కెప్టెన్లలో మోర్గాన్ మూడోవాడు. ఇప్పటికే సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జరిమానా బారిన పడ్డ రెండో కెప్టెన్.
ఐపీఎల్ మార్గదర్శకాల ప్రకారం, తొలిసారి ఓవర్ రేటు నిబంధనలు ఉల్లంఘిస్తే సదరు జట్టు కెప్టెన్‌కు రూ. 12 లక్షలు, మరోసారి అదే తప్పు పునరావృతం చేస్తే రూ. 24 లక్షలు, తుదిజట్టులోని ప్రతీ ఆటగాడి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తారు. ఇక మూడోసారి గనుక ఇలాగే జరిగితే, కెప్టెన్‌కు రూ. 30 లక్షల జరిమానాతో పాటు, ఒక మ్యాచ్‌లో నిషేధం, అదే విధంగా తుదిజట్టులోని ఆటగాళ్లకు రూ. 12 లక్షల జరిమానా లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు.
ఇక్కడ చదవండి: అతను ఔటయ్యాక దూరంగా ఉంటా: మోర్గాన్
IPL 2021: ఇదేం నో బాల్ సైరన్.. క్రికెటర్ల అసహనం!
Comments
Please login to add a commentAdd a comment