లండన్: వన్డే వరల్డ్‌కప్ సమరానికి రంగం సిద్ధమైంది. కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగనున్న ఆరంభపు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ముందుగా ఇంగ్లండ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. అటు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఇరు జట్లు బలంగా ఉండటంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఆసక్తి నెలకొంది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇంగ్లండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, సంచలనాలకు మారుపేరైన సఫారీలు శుభారంభం చేయాలని భావిస్తున్నారు.
ఎన్నోసార్లు అందినట్లే అంది చేజారిన కప్‌పై ఆతిథ్య ఇంగ్లండ్ ఈసారి చాలా ఆశలే పెట్టుకుంది. జట్టంతా బలంగా ఉన్నా... ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్, కీపర్ బట్లర్, ఆల్‌రౌండర్ స్టోక్స్ వారి బ్యాటింగ్ ఆర్డర్‌లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రాయ్, బట్లర్ విధ్వంసక బ్యాటింగ్‌కు పెట్టింది పేరు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ అద్భుతమైన ఫామ్‌లోనూ ఉన్నారు. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్‌గా స్టోక్స్‌పై ఇంగ్లండ్ భారీ ఆశలు పెట్టుకుంది.
(ఇక్కడ చదవండి: పన్నెండో ప్రపంచ యుద్ధం)
ఇక ప్రపంచ కప్‌లో దురదృష్టం వెంటాడే దక్షిణాఫ్రికా పెద్ద స్టార్లంటూ ఎవరూ లేకుండా ఈసారి బరిలో దిగుతోంది. ఆమ్లా, తాహిర్, మిల్లర్ వంటివారున్నా... కెప్టెన్ డు ప్లెసిస్, బ్యాట్స్‌మన్ డికాక్, పేసర్లు స్టెయిన్, రబడల పైనే ఎక్కువ అంచనాలున్నాయి. ఐపీఎల్‌లో అదరగొట్టిన డికాక్, డు ప్లెసిస్ ఫామ్ చాటుకున్నారు. గాయం బెడద లేకుంటే.... వేగం, కచ్చితమైన యార్కర్లు వేసే రబడ ఎంత వరకూ ప్రభావం చూపుతాడో చూడాలి.
తుది జట్లు
దక్షిణాఫ్రికా
డుప్లెసిస్(కెప్టెన్), హషీమ్ ఆమ్లా, డీకాక్, మర్కరమ్, వాన్ డెర్ డస్సెన్, జేపీ డుమినీ, డ్వైన్ ప్రిటోరియస్, ఫెహ్లుకోవాయా, కగిసో రబడా, లుంగి ఎన్‌గిడి, ఇమ్రాన్ తాహీర్
ఇంగ్లండ్
ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), జేసన్ రాయ్, జోనీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, అదిల్ రషీద్, లియామ్ ప్లంకెట్, జోఫ్రా ఆర్చర్
Comments
Please login to add a commentAdd a comment