Eoin Morgan (Image Credit: Twitter)
ముంబై: రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిస్లే తాము కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవాలనుకున్నామని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపాడు. మేమంతా ఒకే పడవలో ప్రయాణిస్తున్నామని సరదాగా వ్యాఖ్యానించాడు. రాజస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్‌కు వచ్చిన సమయంలో మోర్గాన్.. వాంఖడే స్టేడియంలో పరిస్థితుల్ని అర్థం చేసుకున్నామన్నాడు. ‘మేము గత మ్యాచ్ ఆడిన సందర్భంలో 220 పరుగుల స్కోరు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టు సాధించింది. ఇది ఇక్కడ మాకు రెండో గేమ్. పరిస్థితులు అర్థమయ్యాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ థ్రిల్లింగ్‌గా అనిపించింది. మేము ఆటను ముగించిన విధానం అసాధారణమే. మా మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ అంతా ఫామ్‌లోకి వచ్చారు.
మేము ఆడే ఆటకు ఇక్కడ మైదానం సూట్ అవుతుంది. మా తప్పిదాల్ని నుంచి బయటపడతామని భావిస్తున్నాం’ అని తెలిపాడు. ఇక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కెప్టెన్ సామ్సన్ మాట్లాడుతూ. .ఇక్కడ పరిస్థితులు బౌలర్లకు అనుకూలిస్తాయని ముందుగా బౌలింగ్‌కు వెళ్లామన్నాడు. తాము చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండా ఆడుతున్నా పాజిటివ్‌గా ముందుకు వెళుతున్నామన్నాడు. ఈ విషయంలో టీమ్ మెంబర్స్‌ను, మేనేజ్‌మెంట్‌ను అభినందిస్తున్నట్లు తెలిపాడు. ఐపీఎల్ వంటి మెగా టోర్నీలో ఎత్తు పల్లాలు సహజమని, దాని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉండటమే మంచిదన్నాడు. తమ వాళ్లంతా మంచి క్రికెట్ ఆడతారని భావిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment