టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ టి20ల్లో మరో మైలురాయిని అందుకున్నాడు. స్వదేశంలో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా రోహిత్ తొలి స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు రోహిత్ టీమిండియా టి20 కెప్టెన్‌గా స్వదేశంలో 15 విజయాలు అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్ విజయం రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ విజయం. తద్వారా ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, కేన్ విలియమ్సన్‌లను(చెరో 15 విజయాలు) రోహిత్ అధిగమించడం విశేషం.
ఇప్పటికే స్వదేశంలో టి20 కెప్టెన్‌గా అత్యధిక విజయాలు సాధించిన జాబితాలో కోహ్లి(13), ఎంఎస్ ధోని(10)లను రోహిత్ ఎప్పుడో దాటేశాడు. ఓవరాల్‌గా టి20ల్లో రోహిత్ శర్మకు కెప్టెన్‌గా 27 మ్యాచ్‌ల్లో.. ఇది 23వ విజయం కావడం విశేషం. ఇక టీమిండియాకు పొట్టి ఫార్మాట్‌లో వరుసగా 11వ విజయం. టి20 ప్రపంచకప్‌లో అఫ్గనిస్తాన్‌పై గెలుపుతో మొదలైన విజయాల పరంపరను టీమిండియా దిగ్విజయంగా కొనసాగిస్తుంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే రెండో టి20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. పతుమ్ నిసాంకా (53 బంతుల్లో 75; 11 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, గుణతిలక (29 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. చివర్లో షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగిపోవడంతో లంకకు భారీ స్కోరు సాధ్యమైంది. అనంతరం భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి అంతర్జాతీయ టి20ల్లో వరుసగా 11వ విజయం నమోదు చేసుకుంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయస్ అయ్యర్ (44 బం తుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్), సామ్సన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌లు జట్టును గెలిపించాయి.
చదవండి: IPL 2022 CSK: అతనితో బ్యాటింగ్ చేయడంలో ఉన్న కిక్కే వేరప్పా..
Comments
Please login to add a commentAdd a comment