మాంచెస్టర్: గత కొన్నేళ్లుగా వన్డే ఫార్మాట్‌లో తన ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌కు సిద్ధమయ్యాడు. ఈ రోజు నుంచి మాంచెస్టర్ వేదికగా ఆరంభంగా కానున్న వన్డే సిరీస్‌లో మోర్గాన్ మరోసారి బ్యాట్ ఝుళిపించే అవకాశం ఉంది. ఇప్పటికే మోర్గాన్ నేతృత్వంలోని మోర్గాన్ సేన టీ20 సిరీస్‌ను గెలుచుకోగా, ఇప్పుడు వన్డే సిరీస్‌పై కన్నేసింది. అదే సమయంలో ఆసీస్‌కు ఈ లెఫ్ట్ హ్యాండర్ బెంగ పట్టుకుంది. ఇందుకు ఆసీస్‌పై వన్డేల్లో మోర్గాన్‌కు తిరుగులేని రికార్డు ఉండటమే. మరొకవైపు వన్డేల్లో ఇంగ్లండ్ ఆల్‌టైమ్ లీడింగ్ రన్ స్కోరర్‌గా మోర్గాన్ కొనసాగుతుండటంతో అతనిపైనే ఆసీస్ ప్రధానంగా దృష్టి సారించనుంది. ప్రస్తుతం మోర్గాన్ వన్డేల్లో 6,766 పరుగులు సాధించి ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో టాప్‌లో ఉన్నాడు. ఇక వన్డేల్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వన్డే మ్యాచ్‌లు ఆడింది కూడా మోర్గానే కావడం విశేషం. తన 11 ఏళ్ల కెరీర్‌లో మోర్గాన్ 216 మ్యాచ్‌లు ఆడాడు.ఇక తన సారథ్యంలో ఇంగ్లండ్ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ను గెలుచుకని చరిత్ర సృష్టించింది. (చదవండి: సెరెనాకు ఊహించని షాక్)
వన్డే ఫార్మాట్‌లో ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్ మోర్గాన్. ఆసీస్‌పై అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి వాటం ఆటగాడు మోర్గాన్. ఇప్పటివరకూ ఆసీస్‌పై 54 వన్డేలు ఆడిన మోర్గాన్.. 1,864 పరుగులు నమోదు చేశాడు. ఇది ఆసీస్‌పై ఏ దేశం తరఫున చూసిన ఒక లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ సాధించిన అత్యధిక పరుగుల రకార్డుగా ఉంది. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఎడమచేతి ఆటగాళ్ల జాబితాలో మోర్గాన్ తొలి స్థానంలో ఉండగా, బ్రియాన్ లారా(వెస్టిండీస్) తర్వాత స్థానంలో ఉన్నాడు. ఆసీస్‌పై లారా సాధించిన పరుగులు 1,858. ఆపై వరుస స్థానాల్లో కుమార సంగక్కరా(1,813 శ్రీలంక), స్టీఫెన్ ఫ్లెమింగ్( 1,241 న్యూజిలాండ్), గ్యారీ కిరెస్టన్(1,167 దక్షిణాఫ్రికా)లు ఉన్నారు. ఆసీస్‌పై మోర్గాన్ 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. (చదవండి: స్వీడన్ జట్టు కోచ్‌గా జాంటీ రోడ్స్)
ఆసీస్‌కు అంతుచిక్కని బ్యాట్స్‌మన్
Published Fri, Sep 11 2020 11:06 AM | Last Updated on Fri, Sep 11 2020 11:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment