ఐపీఎల్-2022 మెగా వేలంలో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కోసం మూడు జట్లు పోటీ పడనున్నట్లు తెలుస్తోంది. వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ మోర్గాన్‌ను రీటైన్ చేసుకోలేదు. వేలంలో 1.5 కోట్ల బేస్ ఫ్రైజ్‌కు తన పేరును మోర్గాన్ నమోదు చేసుకున్నాడు. కాగా గత కొద్ది రోజులు నుంచి ఫామ్‌లో లేకపోయినా, అతడి కెప్టెన్‌గా అనుభవం ఉండడంతో అతడిని ఫ్రాంచైజీలు దక్కించుకోనేందుకు మక్కువ చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్సీబీ వేలంలో మోర్గాన్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2021 సీజన్ అనంతరం విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోర్గాన్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ యాజమాన్యం భావిస్తోంది. మరోవైపు పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా మోర్గాన్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోన్నట్లు సమాచారం. ఇక ఐపీఎల్ మెగా వేలానికి మరి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఫిబ్రవరి 12, 13 తేదీల్లో బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. ఈ మెగా వేలంలో 590 మంది ఆటగాళ్లు పాల్గోనబోతున్నారు.
చదవండి: IND vs WI 3rd ODI: మొన్న ప్రపంచ రికార్డు.. ఈరోజేమో మరీ ఇలా.. నిరాశపరిచావు కదా!
Comments
Please login to add a commentAdd a comment