
PC: IPL.com
ఐపీఎల్-2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అంతగా రాణించలేకపోయాడు. గత ఏడాది సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చిన కోహ్లి విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 405 పరుగులు మాత్రమే సాదించాడు. అయితే ఐపీఎల్ 2022లో కోహ్లి ఓపెనర్‌గా కాకుండా ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు రావాలని టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా అభిప్రాయ పడ్డాడు.
ఏబీ డివిలియర్స్ క్రికెట్ నుంచి తప్పుకోవడంతో కోహ్లి మరింత బాధ్యత వహించాల్సిఉంటుంది అని అతడు తెలిపాడు. "గతేడాది సీజన్‌లో కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రారంభించినప్పుడు.. మూడో స్దానం కోసం మ్యూజికల్ చైర్స్ గేమ్ ఆడారు. శ్రీకర్ భరత్ కొన్ని మ్యాచ్‌లకు మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రాగా.. కొన్ని మ్యాచ్‌ల్లో గ్లెన్ మాక్స్వెల్ వచ్చే వాడు. వారు గత సీజన్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో చాలా మార్పులు చేశారు.
ఈ సీజన్‌లో కీలకమైన ఆటగాళ్లను ముందు బ్యాటింగ్‌కు పంపాలి. ఇక జట్టులో ఏబీ డివిలియర్స్ లేడు. అతడు జట్టులో ఉన్నప్పుడు పరిస్థితిని బట్టి నాలుగు లేదా ఐదో స్ధానంలో బ్యాటింగ్ చేసేవాడు. అయితే దినేష్ కార్తీక్ జట్టులోకి వచ్చాడు. కానీ అతడి స్ధానాన్ని కార్తీక్ భర్తీ చేయలేడు. ఫస్ట్ డౌన్‌లో ఒక స్ధిరమైన ఆటగాడు కావాలి. కాబట్టి కోహ్లి మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తే జట్టుకు చాలా ఉపయోగపడుతుంది" అని చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: World Cup 2022: మిథాలీ సేనకు షాక్.. సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఆసీస్
Comments
Please login to add a commentAdd a comment