PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగులు తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
గంభీర్, కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం
ఇక ఈ మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌లో వీరిద్దరి మధ్య జరిగిన గొడవను ఇది గుర్తుకు తెచ్చింది. అయితే ఇందులో నేరుగా గంభీర్ పాత్ర లేకపోయినా...అతని జోక్యంతో పరిస్థితి కాస్త వేడిగా మారింది. బెంగళూరు విజయం తర్వాత షేక్ హ్యాండ్‌ల సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో వాదన జరిగింది. చేతులు విసిరికొట్టి మరీ ఇద్దరూ విడిపించుకున్నారు.
అయితే ఆ తర్వాత నవీన్‌ను పిలిచి కోహ్లి ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ముందుగా కైల్ మేయర్స్ (వెస్టిండీస్), ఆ తర్వాత గంభీర్ తమ ఆటగాడికి అండగా నిలుస్తూ మధ్యలోకి వచ్చారు. దాంతో కోహ్లి, గంభీర్ తీవ్రంగా వాదించుకున్నారు. చివరకు రాహుల్, మిశ్రా జోక్యం చేసుకొని విడిపించాల్సి వచ్చింది.
ఆ తర్వాతా కోహ్లి పదే పదే ఇదే విషయాన్ని రాహుల్‌కు ఫిర్యాదు చేయడం కనిపించింది. నిజానికి గత మ్యాచ్‌లో గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో నోరు మూయమంటూ ప్రేక్షకులను ఉద్దేశించి గంభీర్ సైగ చేయగా...ఈసారి గెలుపు బాటలో కోహ్లి అదే తరహాలో సైగ చేస్తూ దానిని గుర్తు చేయడం కూడా ఒక కారణం కావచ్చు! ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి
చదవండి: LSG VS RCB: టాప్-3లోకి చేరిన అమిత్ మిశ్రా.. ఒకేసారి ముగ్గురిని అధిగమించి..!
The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49
— Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023
Comments
Please login to add a commentAdd a comment