MI Vs RCB: Frustrated Kohli Slams Bat On Ground After Contentious Umpiring Decision - Sakshi
Sakshi News home page

IPL 2022: థర్డ్ అంపైర్ నిర్ణయంపై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం చేశాడంటే..!

Published Sun, Apr 10 2022 2:25 PM | Last Updated on Sun, Apr 10 2022 4:03 PM

Virat Kohli  Hits Ground With His Bat in Anger After Getting Out to Dewald Brevis - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా మూడో విజయం నమోదు చేసింది. శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఔటైన తీరు వివాదాస్పదంగా  మారింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 19 ఓవర్‌లో డెవాల్డ్ బ్రెవిస్ వేసిన తొలి బంతిని ఢిపెన్స్‌ ఆడటానికి విరాట్‌ కోహ్లి ప్రయ్నతించాడు. ఈ క్రమంలో బంతి మిస్స్‌ అయ్యి కోహ్లి ప్యాడ్‌ను తాకింది. దీంతో బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్‌బీడబ్ల్యూకి అప్పీల్ చేయడంతో ఫీల్డ్ అంపైర్ దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. అయితే వెంటనే కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. కాగా రీప్లేలో బంతి బ్యాట్‌, ప్యాడ్‌ రెండింటినీ తాకుతున్నట్లు కనిపించింది.

దీంతో కోహ్లితో పాటు అభిమానులు ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోక తప్పదని భావించారు. అయితే  బంతి బ్యాట్‌కు ముందు తాకినట్లు సృష్టమైన ఆధారాలు కనిపించడం లేదంటూ థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయానికి కోహ్లితో పాటు అందరూ ఒక్క సారిగా షాక్‌కు గురయ్యారు. థర్డ్ అంపైర్ నిర్ణయంపై  ఆగ్రహం వ్యక్తం చేసిన కోహ్లి.. పెవిలియన్‌కు వెళ్తుండగా గట్టిగా అరుస్తూ బ్యాట్‌ను నేలకేసి  కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి అద్భుతంగా రాణించాడు. కోహ్లి 36 బంతుల్లో 48 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక కోహ్లి ఎల్బీడబ్లూ‍్య వివాదంపై ఆర్సీబీ మెనేజేమెం‍ట్‌ స్పందించింది. "మేరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ నియమం 36.2.2 ప్రకారం.. బంతి బ్యాటను, ప్యాడ్‌ను తాకుతున్నట్లు అనిపిస్తే.. అది బ్యాట్‌ను తాకినట్లు గాను పరిగణించాలి" అని ట్విటర్‌లో పేర్కొంది.

చదవండి: IPL 2022: బయో బబుల్‌ను వీడిన ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌! కారణం?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement