PC: TWITTER
లక్నో సూపర్ జెయింట్స్, ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా మైదానంలోనే గొడవపడ్డ విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌లకు బిగ్ షాక్ తగిలింది. వీరిద్దరితో పాటు గొడవకు పరోక్షంగా కారణమైన నవీన్-ఉల్-హక్‌లకు ఐపీఎల్ నిర్వహకులు భారీ జరిమానా విధించారు.
కోహ్లి, గంభీర్ మ్యాచ్ ఫీజులో 100 శాతం.. నవీన్-ఉల్-హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కొత ఐపీఎల్ నిర్వహకులు విధించారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 2 ఆర్టికల్ 2.21 కింద ఈ ముగ్గిరికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఏం జరిగిందంటే?
మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. షేక్ హ్యండ్ ఇచ్చే సమయంలో కోహ్లి, లక్నో పేసర్ నవీనుల్ హఖ్ మధ్య ఏదో వాదన జరిగింది. తర్వాత ఇదే విషయంపై లక్నో ఆటగాడు కైల్ మైర్స్ కోహ్లితో మాట్లాడతుండగా.. గంభీర్ అతడితో మాట్లాడవద్దు అంటూ మైర్స్‌ను తీసుకు వెళ్లిపోయాడు. దీంతో గంభీర్, కోహ్లి మధ్య మాటమాట పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో సహచర ఆటగాళ్లు జోక్యం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఆర్సీబీ సంచలన విజయం
ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఆర్సీబీ సంచలన విజయం సాధించింది. 127 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో 108 పరుగులకే ఆలౌటైంది. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్‌వుడ్, కరణ్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా మ్యాక్స్‌వెల్, హసరంగా, సిరాజ్, హర్షల్ పటేల్ తలా వికెట్ సాధించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో బౌలర్లు చెలరేగడంతో కేవలం 126 పరుగులు మాత్రమే చేసింది. లక్నోబౌలర్లలో నవీనుల్ హఖ్ మూడు వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్, మిశ్రా తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో డుప్లెసిస్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
చదవండి: #Kohli Gambhir Fight: మళ్లీ డిష్యూం డిష్యూం.. కోహ్లి, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
The full fight video #virat #gambhir #fight #rcb #lsg #RCBvsLSG #TataIPL #DARKBLOOD #LabourDay #IPL #Viral #ViralFight #naveen #LSGvsRCB pic.twitter.com/ehymWbIE49
— Vipul Chahal Infinitech (@v7pul) May 1, 2023
Comments
Please login to add a commentAdd a comment