
సౌతాంప్టన్: ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడి వన్డే కెరీర్‌లో 14వ సెంచరీ నమోదు చేశాడు. టామ్ బాంటన్ (51 బంతుల్లో 58; 6 ఫోర్లు, సిక్స్)తో కలిసి మోర్గాన్ నాలుగో వికెట్‌కు 146 పరుగులు జోడించాడు. చివర్లో విల్లీ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), టామ్ కరన్ (38 నాటౌట్; 4 ఫోర్లు) కూడా మెరిపించడంతో ఇంగ్లండ్ స్కోరు 300 పరుగులు దాటింది. 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్ కడపటి వార్తలు అందే సమయానికి 21 ఓవర్లలో వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. తొలి రెండు వన్డేల్లో నెగ్గిన ఇంగ్లండ్ ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది.