లండన్: షెడ్యూల్ ప్రకారం వచ్చే అక్టోబరులో ఆస్ట్రేలియా గడ్డపై టి20 ప్రపంచ కప్ జరగడం సందేహమేనని ఇంగ్లండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అభిప్రాయ పడ్డాడు. కోవిడ్–19 నేపథ్యంలో 16 జట్లతో మెగా టోర్నీ నిర్వహించడం అసాధ్యమని అతను అన్నాడు. ‘నిజంగా షెడ్యూల్ ప్రకారం జరిగితే మనమంతా ఆశ్చర్యపడాల్సిందే. మిగతా దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కరోనా సమస్య తక్కువగా, నియంత్రణలోనే ఉందనేది వాస్తవం. అయితే ఒక చిన్న పొరపాటు కూడా ఎంతో ప్రమాదకరంగా మారిపోవచ్చు. 16 జట్లతో టోర్నీ నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడైనా ఏదైనా జరగవచ్చు. కొన్ని కేసులు బయటపడితే చాలు వ్యాధి అతి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ పరిస్థితుల్లో వరల్డ్ కప్ వాయిదా పడుతుందనే భావిస్తున్నా. ఈ సమయంలో అదే పాజిటివ్ నిర్ణయం అవుతుంది’ అని మోర్గాన్ వ్యాఖ్యానించాడు. సారథిగా గత ఏడాది తమ జట్టును వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిపిన మోర్గాన్ టి20 ప్రపంచకప్‌ను కూడా గెలిపించాలని ఉందనే తన కోరికను బయటపెట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment