ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా మోర్గాన్ | Eoin Morgan captain England team | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ వన్డే కెప్టెన్‌గా మోర్గాన్

Published Sun, Dec 21 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

Eoin Morgan captain England team

లండన్: ప్రపంచకప్‌లో పాల్గొనే ఇంగ్లండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అలిస్టర్ కుక్ స్థానంలో అతన్ని ఎంపిక చేసినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) శనివారం వెల్లడించింది. టెస్టు జట్టు కెప్టెన్‌గా మాత్రం కుక్‌నే కొనసాగించనున్నారు.గత 22 వన్డేల్లో ఒకే ఒక్క అర్ధసెంచరీ చేసిన కుక్... ఇటీవల లంకతో జరిగిన సిరీస్‌ను 2-5తో కోల్పోవడంతో అతని కెప్టెన్సీపై ఈసీబీ వేటు వేసింది.
 
 వన్డే కెప్టెన్సీ కోల్పోయిన కుక్... ప్రపంచకప్ జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశ కలిగించిందని కుక్ అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement