
రెండేళ్లలో ఇదే చెత్త బ్యాటింగ్
భారత్తో టి-20 సిరీస్లో ఓటమికి బ్యాటింగ్ వైఫలమ్యే కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిందించాడు.
బెంగళూరు: భారత్తో టి-20 సిరీస్లో ఓటమికి బ్యాటింగ్ వైఫలమ్యే కారణమని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నిందించాడు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సిరీస్లో తమ బ్యాటింగ్ అత్యంత చెత్తగా ఉందని చెప్పాడు.
టీమిండియాతో జరిగిన మూడు టి-20ల సిరీస్ను ఇంగ్లీష్ మెన్ 1-2తో ఓడిపోయిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బుధవారం జరిగిన మూడో టి-20లో ఇంగ్లండ్ చిత్తుగా ఓడింది. 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 127 పరుగులకు చాపచుట్టేసింది. ఈ మ్యాచ్లో ఓడిపోవడం తీవ్ర నిరాశ కలిగించిందని మోర్గాన్ అన్నాడు. మ్యాచ్లో 60 శాతం హోరాహోరీగా పోరాడామని, చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోయి చిత్తుగా ఓడిపోయామన్నాడు. ఈ సిరీస్లో బ్యాటింగ్లో నిలకడగా రాణించలేకపోయామని, రెండేళ్లలో ఇదే చెత్త ప్రదర్శన అని చెప్పాడు.