ఇంగ్లండ్ రికార్డు ఛేజింగ్! | Morgan leads England to stunning win over New Zealand | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ రికార్డు ఛేజింగ్!

Jun 18 2015 2:05 PM | Updated on Sep 3 2017 3:57 AM

ఇంగ్లండ్ రికార్డు ఛేజింగ్!

ఇంగ్లండ్ రికార్డు ఛేజింగ్!

రికార్డు ఛేజింగ్ తో ఇంగ్లీషు సేన జయకేతనం ఎగురవేసింది. కివీస్ తో నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన పోరులో పైచేయి సాధించి సిరీస్ సమం చేసింది.

నాటింగ్ హామ్: రికార్డు ఛేజింగ్ తో ఇంగ్లీషు సేన జయకేతనం ఎగురవేసింది. కివీస్ తో నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన పోరులో పైచేయి సాధించి సిరీస్ సమం చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో వన్డేలో ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని 6 ఓవర్లు మిగిలివుండానే ఛేదించింది. ఇంగ్లండ్ 44 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 350 పరుగులు చేసింది.

కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సంచలన ఇన్నింగ్స్ కు రూట్ సెంచరీ తోడవడంతో ఇంగ్లీషు టీమ్ భారీ లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకుంది. మోర్గాన్ 82 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లతో 113 పరుగులు బాదాడు. రూట్ 97 బంతుల్లో 13 ఫోర్లతో 106 పరుగులు సాధించాడు. హేల్స్(67) అర్ధసెంచరీ చేశాడు. రాయ్ 38, స్టోక్స్ 19 పరుగులు చేశారు.

టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 349 పరుగులు చేసింది. విలియమ్సన్(90), ఇలియట్(55), గప్టిల్(53) రాణించారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించడంతో ఐదు వన్డేల సిరీస్ 2-2తో సమం అయింది. మోర్గాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు. వన్డేల్లో ఇంగ్లండ్ కు ఇది అతిపెద్ద ఛేజింగ్ కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement