T20 World Cup 2021 Semi-Final: Eoin Morgan Reaction After England Loss Against New Zealand - Sakshi
Sakshi News home page

Eoin Morgan: ఆ పని మేము చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం...

Published Thu, Nov 11 2021 12:12 PM | Last Updated on Thu, Nov 11 2021 1:30 PM

 Eoin Morgan Reacts After Semifinal Loss vs New Zealand - Sakshi

Eoin Morgan Reacts After Semifinal Loss vs New Zealand:  టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించి న్యూజిలాండ్‌ తొలి సారిగా ఫైనల్లో అడుగు పెట్టింది. కాగా ఈ ఓటమిపై స్పందించిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ మోర్గాన్ ఏమన్నాడంటే.. "ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందే మాకు తెలుసు ప్రత్యర్ధి జట్టు అన్ని విధాలుగా పటిష్టంగా ఉందని.. ఈ మ్యాచ్‌లో పూర్తి క్రెడిట్ న్యూజిలాండ్‌ జట్టుకే ఇవ్వాలి.ఎందుకంటే వాళ్లు మా జట్టుకన్నా బాగా ఆడారు. కివీస్‌ బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. వాళ్ల స్పిన్నర్లు కూడా అద్బుతంగా రాణించారు. ఈ టోర్నీలో మేము కూడా చాలా కష్టపడ్డాం. ఆ క్రెడిట్‌ అంతా మా బాయ్స్‌కు ఇవ్వాలి.

ఈ మ్యాచ్‌లో  17వ, 18వ ఓవర్ల వరకు విజయం మావైపే ఉందని అనుకున్నాం. కానీ ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ స్వరూపం మారిపోయింది. సాధారణంగా మా జట్టు సిక్స్‌లు బాగా కొట్టగలదు. కానీ ఈ మ్యాచ్‌లో సిక్సర్లు కొట్టడానికి చాలా కష్టపడ్డాము. ప్రత్యర్ధి ముందు మేము మెరుగైన లక్ష్యాన్ని ఉంచాము. కానీ న్యూజిలాండ్‌  జట్టు మా కన్నా నిలకడగా, ఉత్తమంగా ఆడింది. ముఖ్యంగా జెమ్మీ నీషమ్‌ అధ్బుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు" అని మ్యాచ్‌ అనంతరం మోర్గాన్ పేర్కొన్నాడు. మరో వైపు పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య రెండో సెమిఫైనల్‌ మ్యాచ్‌ గురువారం(నవంబర్‌-11) జరగనుంది.

చదవం‍డి: Pak Vs Aus: ఆసీస్‌తో సెమీస్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాకులు.. వాళ్లు లేకుండా ఫైనల్‌ చేరడం కష్టమే?!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement