మోర్గాన్‌ సిక్సర్ల వర్షం | Morgans explosive hundred puts England in control | Sakshi
Sakshi News home page

మోర్గాన్‌ సిక్సర్ల వర్షం

Published Tue, Jun 18 2019 6:16 PM | Last Updated on Tue, Jun 18 2019 10:02 PM

Morgans explosive hundred puts England in control - Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌ జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చెలరేగిపోయింది. ప్రధానంగా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో శతకం బాదేశాడు. బెయిర్‌ స్టో రెండో వికెట్‌గా ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన మోర్గాన్‌ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. బౌండరీలే లక్ష్యంగా విజృంభించి ఆడాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్‌.. దాన్ని సెంచరీగా మలుచుకోవడానికి మరో 21 బంతుల్నే తీసుకున్నాడు. మోర్గాన్‌ సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్‌తోనే సాధించడం ఇక్కడ విశేషం. ఇది నాల్గో ఫాస్టెస్ట్‌ వరల్డ్‌కప్‌ సెంచరీగా రికార్డులకెక్కింది.

 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. దాంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ను జేమ్స్‌ విన్సే-బెయిర్‌ స్టోలు ఆరంభించారు. కాగా, జట్టు స్కోరు 44 పరుగుల వద్ద ఉండగా విన్సే(26) తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత బెయిర్‌ స్టోతో జో రూట్‌ జత కలిశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత బెయిర్‌ స్టో(90) ఔటయ్యాడు.  ఇంగ్లండ్‌ స్కోరు 164 పరుగుల వద్ద ఉండగా బెయిర్‌ స్టో ఔట్‌ కాగా, ఆపై మోర్గాన్‌-జోరూట్‌లు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఒకవైపు మోర్గాన్‌ పరుగుల దాహంతో చెలరేగి పోవడంతో మరొకవైపు జో రూట్‌ నెమ్మదించాడు.  మోర్గాన్‌ విరుచుకుపడటంతో అఫ్గాన్‌ బౌలర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ఓవరాల్‌ వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వరల్డ్‌కప్‌లో గేల్‌ 16 సిక్సర్లు కొట్టగా, దాన్ని మోర్గాన్‌ బ్రేక్‌ చేశాడు. అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. అంతకముందు జోరూట్‌(88) మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. వీరిద్దరూ ఆరు పరుగుల వ్యవధిలో పెవిలియన్‌ చేరారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement