టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ నెట్స్‌లో త్రీవంగా చెమటోడుస్తున్నాడు. యువీ బ్యాటింగ్‌లో శ్రమిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి యువరాజ్ ఇంతకు దేనికోసం ఇంత ప్రాక్టీస్ చేస్తున్నట్లు.. అనే డౌట్ వచ్చిందా. అక్కడికే వస్తున్నాం.భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా బీసీసీఐ ఒక స్పెషల్ మ్యాచ్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఇండియా మహారాజాస్ వర్సెస్ వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ జట్టుకు గంగూలీ నాయకత్వం వహించనున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్, హర్బజన్ సింగ్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, అజయ్ జడేజా, యూసఫ్ పఠాన్ సహా మరికొంత మంది ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. అయితే, యువీ పేరు ఇటీవల ప్రకటించిన జట్టులో లేనప్పటికీ ఈ మేరకు ఈ మాజీ డాషింగ్ ఆల్‌కరౌండర్ నెట్స్‌లో శ్రమించడం విశేషం. దీంతో ఆఖరి నిమిషంలోనైనా యువీ ఎంట్రీ ఇవ్వనున్నాడా అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. కాగా యువరాజ్ ప్రాక్టీస్‌కు ముందు ఒక అభిమాని.. ''మీ కార్‌లో క్రికెట్ కిట్ ఏం చేస్తోంది'' అని అడిగాడు. యువీ స్పందిస్తూ.. నాకు కొంచెం ప్రాక్టీస్ అవసరం. ఏదైనా మ్యాచ్‌లో బరిలోకి దిగడానికి ప్రాక్టీస్ చేయడం అవసరం. పేర్కొన్నాడు.
ఆ తర్వాత యువరాజ్ తన కిట్ ఓపెన్ చేసి తన ప్యాడ్లను చూపిస్తూ ''వారియర్ ఈజ్ బ్యాక్''.. రానున్న జరగబోయే మ్యాచ్‌కోసం నేను మంచి ఉత్సాహంతో ఉన్నా.. నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ కోసం వెళ్తున్నా అంటూ తెలిపాడు. ఇక ప్రాక్టీస్ ముగిసిన అనంతరం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బాగా అలసిపోయా.. కొద్దిసేపు నాకు ఊపిరి తీసుకోవడం కష్టమయింది. ఆల్ ది బెస్ట్.. ఇండియన్ మహరాజాస్ అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక యువరాజ్ టీమిండియా తరపున గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. 19 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన యువరాజ్ 2007, 2011 ప్రపంచకప్‌లు గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అంతేకాదు 2007 టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి యువరాజ్ చరిత్ర సృష్టించాడు.
కాగా జూన్ 10, 2019లో యువరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 19 ఏళ్ల కెరీర్‌లో యువరాజ్ టీమిండియా తరపున 40 టెస్టుల్లో 3 సెంచరీలు.. 11 అర్థసెంచరీల సాయంతో 1900 పరుగులు.. 10 వికెట్లు తీశాడు. ఇక 304 వన్డేల్లో 14 సెంచరీలు.. 52 హాఫ్‌సెంచరీలతో కలిపి 8701 పరుగులతో పాటు 111 వికెట్లు పడగొట్టాడు. ఇక 58 టి20ల్లో 8 అర్థసెంచరీల సాయంతో 1177 పరుగులు చేశాడు.
Didn’t do too bad, did I? 🤪 Super excited for what’s coming up! pic.twitter.com/MztAU5nyZJ
— Yuvraj Singh (@YUVSTRONG12) August 16, 2022
Are you as excited about the special India@75 match between India @IndMaharajasLLC and World @WorldGiantsLLC? Announcing the full squads of #Legends in the next tweet! #LegendsLeagueCricket #AzadiKaAmritMahotsav@Souravganguly @Eoin16 @AmritMahotsav @cabcricket @DasSanjay1812 pic.twitter.com/oUZZQaOUFv
— Legends League Cricket (@llct20) August 12, 2022
ఇండియా మహరాజాస్: సౌరవ్ గంగూలీ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, మహ్మద్ కైఫ్, యూసుఫ్ పఠాన్, ఎస్ బద్రీనాథ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, ఎస్ శ్రీశాంత్, హర్భజన్ సింగ్, నమన్ ఓజా, అశోక్ దిండా, ప్రజ్ఞాన్ ఓజా, అజయ్ సింగ్ జడేజా,ఆర్ పీ సింగ్ , జోగిందర్ శర్మ
వరల్డ్ జెయింట్స్: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లెండిల్ సిమన్స్, హెర్షెల్ గిబ్స్, జాక్వెస్ కల్లిస్, సనత్ జయసూర్య, మాట్ ప్రియర్, నాథన్ మెకల్లమ్, జాంటీ రోడ్స్, ముత్తయ్య మురళీధరన్, డేల్ స్టెయిన్, హామిల్టన్ మసకద్జా, మష్రాఫ్ మోర్టాజా, అస్గ్హర్ మోర్టాజా, అస్గ్‌హర్‌ట్‌జాన్ అఫ్ట్‌సన్, , కెవిన్ ఓ'బ్రియన్, దినేష్ రామ్‌దిన్
చదవండి: ఇండియా మహరాజాస్ కెప్టెన్‌గా గంగూలీ.. పోటీకి సన్నద్ధం!
LLC 2022: ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్.. సనత్ జయసూర్య అవుట్! షేన్ వాట్సన్ ఇన్
Comments
Please login to add a commentAdd a comment