
సౌరవ్ గంగూలీ(PC: Sourav Ganguly Instagram)
అభిమానులకు ఊహించని షాకిచ్చిన గంగూలీ! నేను బిజీ అందుకే!
Sourav Ganguly- LLC 2022: టీమిండియా మాజీ కెప్టెన్, భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అభిమానులకు ఊహించని షాకిచ్చాడు. దాదా మళ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలో దిగుతాడంటూ ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడు. కాగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (భారత్ 75 ఏళ్ల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా)లో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 తాజా సీజన్ ప్రత్యేక మ్యాచ్‌తో ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్‌గార్డెన్స్ వేదికగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబరు 16న చారిటీ మ్యాచ్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ మ్యాచ్‌లో ఇండియా మహరాజాస్‌కు గంగూలీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడని ప్రకటన విడుదల చేశారు నిర్వాహకులు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ మ్యాచ్ నుంచి సౌరవ్ గంగూలీ తప్పుకొన్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.
వ్యక్తిగత కారణాల వల్ల గంగూలీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. ఈ మేరకు.. ‘‘అవును... నేను చారిటీ మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ సమయాభావం వల్ల ఆడలేకపోతున్నాను’’ అని గంగూలీ పేర్కొనట్లు తెలిపింది. కాగా ఇండియా మహరాజాస్‌తో మ్యాచ్‌లో వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మెర్గాన్ సారథిగా వ్యవహరించనున్నాడు.
చదవండి: Ind Vs Pak: హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో చెత్త ప్రదర్శన.. అయినా వాళ్లిద్దరూ తుది జట్టులో ఉండాల్సిందే!
LLC 2022: లెజెండ్స్ లీగ్ క్రికెట్ పూర్తి షెడ్యూల్ విడుదల..