
లండన్: మరో ఐదు రోజుల్లో వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయపడ్డాడు. శనివారం ఆస్ట్రేలియాతో జరుగనున్న వార్మప్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా మోర్గాన్ చూపుడు వేలుకు గాయమైంది. దాంతో ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్‌కు మోర్గాన్ దూరం కానున్నాడు. కాగా, మోర్గాన్ అయిన గాయం చిన్నపాటిదే కావడంతో తొలి మ్యాచ్ నాటికి అతను అందుబాటులోకి వస్తాడని ఇంగ్లండ్ యాజమాన్యం స్పష్టం చేసింది.
ఎడమ చూపుడు వేలికి గాయం కావడంతో ముందుజాగ్రత్తగా ఎక్స్‌రే తీయించామని, ఆ గాయం చిన్నదేనని ఎక్స్‌రేలో తేలడంతో ఇంగ్లండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది. తమ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఇంగ్లండ్ తలపడనుంది. మే30 (గురువారం)వ తేదీన ఇరు జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగనున్న మ్యాచ్‌తో వరల్డ్‌కప్ సమరం ఆరంభం కానుంది.