
సెయింట్ జార్జియా: వెస్టిండీస్‌తో నాలుగో వన్డేలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఓపెనర్లు అలెక్స్ హేల్స్ (73 బంతుల్లో 82; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు), జానీ బెయిర్ స్టో (43 బంతుల్లో 56; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) వేసిన పునాదిపై వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జాస్ బట్లర్ (77 బంతుల్లో 150; 13 ఫోర్లు, 12 సిక్స్‌లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (88 బంతుల్లో 103; 8 ఫోర్లు, 6 సిక్స్‌లు) సునామీ ఇన్నింగ్స్ ఆడారు. ఫలితంగా ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 418 పరుగుల భారీ స్కోరు చేసింది.
బట్లర్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొత్తం 24 సిక్స్‌లతో ప్రపంచ రికార్డు సృష్టించారు. ఇదే సిరీస్ తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ నెలకొల్పిన 23 సిక్స్‌ల రికార్డును వారు బద్దలు కొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment