సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటి వరకు మంచి శుభారంబాన్ని అందించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కలపి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. కానీ శుక్రవారం జరిగిన రెండో టీ20లో తన మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నిరాశ కలిగించినప్పటికి అభిమానులకు ఈ క్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సిక్స్ వెళ్లే బంతిని ధావన్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి మరి అద్భుతంగా అందుకున్నాడు.