
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల)-11 సీజన్‌లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా పలువురు స్టార్ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. ట్వంటీ 20 స్పెషలిస్టులైన ఇంగ్లండ్ క్రికెటర్లు ఇయాన్ మోర్గాన్, అలెక్స్ హేల్స్‌ను తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తిచూపలేదు. మరొకవైపు ఆస్ట్రేలియా క్రికెటర్ షాన్ మార్ష్ వైపు సైతం ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూడలేదు. ఈ వేలంలో మోర్గాన్ కనీస ధర రూ. 2 కోట్లు ఉండగా, హేల్స్ కు నిర్ణయించిన ధర రూ. 1 కోటిగా ఉంది.
కాగా, ఈ ధరకు కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోవడం ఆసక్తికరంగా మారింది. మార్ష్ కనీస ధర రూ. 1.5 కోట్లు ఉన్నప్పటికీ ఈ స్టార్‌ను కూడా ఎవరూ తీసుకోలేదు. దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు ముందుకు రాకపోగా, వెస్టిండీస్ క్రికెటర్ సిమ్మన్స్‌ను కూడా వేలంలో అమ్ముడుపోలేదు. స్టెయిన్ కనీస ధర రూ. 1 కోటి ఉండగా, సిమ్మన్స్ కనీస ధర రూ. 1.5 కోట్లగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment