దుబాయ్: రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిచి ప్లేఆఫ్స్ ఆశల్ని ఇంకా సజీవంగా ఉంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. , మోర్గాన్( 68 నాటౌట్; 35 బంతుల్లో 5ఫోర్లు, 6 సిక్స్‌లు) అవసరమైన సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, శుబ్‌మన్ గిల్(36; 24 బంతుల్లో 6 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి(39; 34 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్స్‌లు), ఆండ్రీ రసెల్(25; 11 బంతుల్లో 1 ఫోర్, 3సిక్స్‌లు)లు ఆకట్టుకున్నారు. కేకేఆర్ నిర్దేశించిన 192 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో రాజస్తాన్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దాంతో టోర్నీ నుంచి రాజస్తాన్ రాయల్స్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫలితంగా కేకేఆర్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, తమ నుంచి ఇంకా మెరుగైన ప్రదర్శన రావాల్సి ఉన్నా అది రాలేదని అంటున్నాడు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్.(నాకైతే సంబంధం లేదు: రవిశాస్త్రి)
మ్యాచ్ తర్వాత మోర్గాన్ మాట్లాడుతూ..‘ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మేము చేయాల్సింది పూర్తిగా చేశామని అనుకోవడం లేదు. మేము బాగా ఆడలేదని అనుకుంటున్నా. మేము సాధించిన స్కోరు ఛేదించే అవకాశం ఉన్న స్కోరే. నాకు ప్రతీ ఒక్కబ్యాట్స్‌మన్ వచ్చి వికెట్ బ్యాటింగ్‌కు చాలా బాగుందని చెప్పారు. దాంతో బ్యాటింగ్ ఫ్రీగా చేయొచ్చని అనుకుంటే అది రివర్స్ అయ్యింది. మేము ఆరంభంలో కీలక వికెట్లు చేజార్చుకున్నాం. మంచు ప్రభావం అనేది మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. మేము అనుకున్న ప్రయోజనమైతే పొందలేదు. కానీ చివరకు పోరాడే స్కోరును బోర్డుపై ఉంచాం. మేము ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాం. కానీ ఇక్కడ నుంచి మా చేతుల్లో లేదు. జరగబోయేది క్రికెట్ గాడ్స్ చేతుల్లోనే ఉంది’ అని మోర్గాన్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment