
శిఖర్ ధావన్
కార్డిఫ్: సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్‌కు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇప్పటి వరకు మంచి శుభారంబాన్ని అందించలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లో కలపి కేవలం 14 పరుగులు మాత్రమే చేశాడు. కానీ శుక్రవారం జరిగిన రెండో టీ20లో తన మార్క్ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమి నిరాశ కలిగించినప్పటికి అభిమానులకు ఈ క్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సిక్స్ వెళ్లే బంతిని ధావన్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి మరి అద్భుతంగా అందుకున్నాడు.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేసిన 14 ఓవర్ తొలి బంతిని ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ భారీ షాట్ కొట్టాడు. దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఉన్న ధావన్ అనూహ్యంగా ఆ బంతిని అందుకోని ఆశ్చర్యపరిచాడు. దీంతో మైదానంలో ఆటగాళ్లు, ప్రేక్షకులు సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఫీట్‌కు ఫీల్డింగ్ దిగ్గజం, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సైతం ఫిదా అయ్యాడు. ‘అరే ఎం క్యాచ్.. కబడ్డీలో ఇలాంటి ఫీట్స్ చేస్తారు’ అని ప్రశంసించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమి చెందడంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది.
Comments
Please login to add a commentAdd a comment