
అనుష్క శర్మ, అయేషా
ముంబై : వెస్టిండీస్‌తో సొంతగడ్డపై 100వ విజయంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. సూయిదాగా మూవీ హిట్‌తో అతని సతీమణి అనుష్కశర్మలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అనుష్కశర్మకు సంబంధించి వచ్చిన వార్తలు ఇప్పుడు విరుష్క అభిమానులను కలవరపెడుతున్నాయి. టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ భార్య అయేషా ముఖర్జీ, అనుష్కశర్మలు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. ఎక్కడికెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తుంటారు. అనేక మ్యాచ్‌ల్లో ఈ ఇద్దరు గ్యాలరీల్లో సందడి చేస్తూ తమ పార్టనర్స్‌కు మద్దతుగా నిలిచేవారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య మాటలు లేవని, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని, అనుష్కశర్మపై అయేషా పీకలదాకా కోపం పెంచకుందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. (చదవండి: భారత్ 100వ విజయం)
వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు శిఖర్ ధావన్‌కు చోటు దక్కని విషయం తెలిసిందే. ఇదే అయేషా, అనుష్కశర్మల మధ్య గొడవకు కారణమని డైనిక్ జాగ్రన్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. తన భర్తకు చోటు దక్కకపోవడానికి అనుష్కనే కారణమని అయేషా అగ్గి మీద గుగ్గిలమవుతుందని, ఇక జట్టుతో అనుష్క ఉన్నప్పుడు ఆమె జట్టు అంతర్గత సమావేశాలకు కూడా హాజరవుతుందని ఈ కథనం వివరించింది.అయేషా మాత్రం.. ఇవన్నీ గాలివార్తలనీ అలాంటి గొడవేమీ లేదనీ, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని స్పష్టం చేశారు. బీసీసీఐ అధికారులు సైతం వారి మధ్య ఎలాంటి గొడవ లేదన్నారు. ఇంగ్లండ్‌తో రెండో వన్డే సందర్భంగా విరాట్ ఆ ఇద్దరికి పాస్‌లు ఏర్పాటు చేశాడని చెప్పారు. అనుష్కశర్మ మాత్రం ఇంకా స్పందించలేదు. ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన ధావన్.. ఆసియాకప్‌లో రాణించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన విషయం తెలిసిందే. (హర్భజన్ ఇంత దురహంకారమా?)
Comments
Please login to add a commentAdd a comment