ధావన్‌ను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు | Shikhar Dhawan Gets Trolled After He Shares Picture With Virat Kohli | Sakshi
Sakshi News home page

ధావన్‌ను ఓ ఆట ఆడుకున్న నెటిజన్లు

Published Mon, Jul 30 2018 3:14 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Shikhar Dhawan Gets Trolled After He Shares Picture With Virat Kohli - Sakshi

శిఖర్‌ ధావన్‌

హైదరాబాద్‌ : టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఎసెక్స్‌ జట్టుతో జరిగిన మూడు రోజుల సన్నాహక మ్యాచ్‌లో శిఖర్‌ ధావన్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో డకౌట్‌గా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ సందర్భంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, నయావాల్‌ చతేశ్వర పుజారాలతో కలిసి ఫీల్డింగ్‌ చేసిన ఓ ఫొటోను గబ్భర్‌ అభిమానులతో పంచుకున్నాడు.

దీనికి పుజారా, కోహ్లిలు ఉండగా.. బంతి ఎక్కడికి పోతుందనే అర్థం వచ్చేలా హిందీలో ఓ కవితాత్మక క్యాప్షన్‌ పెట్టాడు. అయితే ఈ పోస్ట్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ముందు ఈ ముచ్చట్లు ఆపి పరుగులు చేయమని ఘాటుగా బదులిస్తున్నారు. పరుగులు చేయకపోతే జట్టు నుంచి పోతావ్‌ అని అదే ప్రాసలో పంచ్‌ ఇస్తున్నారు. ఇక అంతక ముందు ధావన్‌ షేర్‌ చేసిన ప్రాక్టీస్‌ వీడియోకు కూడా ఇలానే నెగటీవ్‌ కామెంట్స్‌ వచ్చాయి.

చదవండి: రెండు సార్లు డకౌట్‌.. ఇది కాదా స్థిరత్వం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement