కేఎల్ రాహుల్
సౌతాంప్టన్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఘోరంగా విఫలమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బాధ్యతాయుతంగా ఆడకుండా డకౌట్ కావాడన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అభిమానుల ఆగ్రహానికి అవకాశం ఇచ్చింది కూడా కేఎల్ రాహలే. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే రాహుల్.. టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ పుట్టిన రోజున (సెప్టెంబర్ 2న) అత్యంత నిజాయితీగా, ఆత్మీయంగా ఉండే వ్యక్తి జట్టులో ఉన్నారంటే అది ఇషాంతే. హ్యాపిబర్త్‌డే’ అని విషెస్ చెబుతూ ట్వీట్ చేశాడు. అదే రోజు గెలవాల్సిన మూడో టెస్ట్‌ను భారత్ ఓడిపోయింది.
ఈ ఓటమికి పూర్తిగా బ్యాట్స్‌మన్ వైఫల్యమే కారణం. కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ అజింక్యా రహానేలు పోరాడిన మిగతా బ్యాట్స్‌మన్ విఫలమవ్వడం.. ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు మంచి శుభారంభం అందకపోవడంతో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. దీంతో సిరీస్‌ను కూడా ఓ మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కోల్పోవాల్సి వచ్చింది. ఈ సమయంలో రాహుల్ ట్వీట్ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లైంది. అంతే విదేశాల్లో తన చెత్త ప్రదర్శనను ప్రస్తావిస్తూ ట్రోల్ చేయసాగారు. ‘రాహుల్.. ఉపఖండం బయట ఆడిన 13 ఇన్నింగ్స్‌ల్లో నీవు చేసిన పరుగులు మొత్తం 171. యావరేజ్ 13’ అని తన చెత్త ప్రదర్శనను ఒకరు గుర్తు చేశారు. ఇంకొకరు ‘ ఈ పరిస్థితుల్లో ట్వీట్ చేయడానికి సిగ్గు, శరం ఉండాలి’ అని ఘాటుగా కామెంట్ చేశారు. మరొకరు అతనికి శరం లేదని, అందుకే మంచి క్రికెటర్ అయినా బ్యాటింగ్ చేయకుండా మోడలింగ్ చేస్తుండు’ అని మండిపడ్డారు.
Sharam bhi nahi aa rha hai haarne k baad tweet kar rha..sirf virat bharoshe hai team
— LOKESH (@Lokesh_Aamirian) 2 September 2018
Comments
Please login to add a commentAdd a comment