భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో వైట్‌బాల్ సిరీస్‌లకు సిద్దమవుతోంది. ఈ వైట్‌బాల్ సిరీస్‌లలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలుత ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. జనవరి 22న ఈడెన్‌గార్డెన్స్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అనంతరం ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతోంది. ఈ సిరీస్‌ల కోసం రెండు వెర్వేరు జట్లను బీసీసీఐ సెలక్షన్ కమిటీ సోమవారం(జనవరి 13) ప్రకటించే అవకాశముంది. అయితే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావించారు.
కానీ ఇప్పుడు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ తమ నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 దృష్ట్యా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాహుల్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-2 అనంతరం స్వదేశానికి చేరుకున్న రాహుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడు.
విజయ్ హజారే ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ కర్ణాటక ఆటగాడు.. తిరిగి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. కాగా రాహుల్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. వన్డే ఫార్మాట్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రాహుల్ ఎనిమిదో స్ధానంలో కొనసాగుతున్నాడు.
ఇప్పటివరకు 77 వన్డేలు ఆడిన రాహుల్.. 49.15 సగటుతో 2851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 18 అర్ధ సెంచరీలు, ఏడు సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా మిడిలార్డర్‌లో భారత్‌కు వెన్నెముకగా రాహుల్ ఉంటాడు.
తన వన్డే కెరీర్‌లో రాహుల్ 5 స్ధానంలో బ్యాటింగ్ వచ్చి ఏకంగా 1269 పరుగులు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి సైతం ఆడనున్నారు. అయితే ఈ సిరీస్‌కు భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా దూరం కానున్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య టీ20 సిరీస్ షెడ్యూల్..
జనవరి 22- తొలి టీ20(కోల్‌కతా)
జనవరి 25- రెండో టీ20(చెన్నై)
జనవరి 28- మూడో టీ20(రాజ్‌కోట్)
జనవరి 31- నాలుగో టీ20(పుణే)
ఫిబ్రవరి 2- ఐదో టీ20(ముంబై, వాంఖడే)
ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే సిరీస్ షెడ్యూల్..
ఫిబ్రవరి 6- తొలి వన్డే(నాగ్‌పూర్)
ఫిబ్రవరి 9- రెండో వన్డే(కటక్)
ఫిబ్రవరి 12- మూడో వన్డే(అహ్మదాబాద్
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత షెడ్యూల్..
ఫిబ్రవరి 20- బంగ్లాదేశ్ (దుబాయ్)
ఫిబ్రవరి 23- పాకిస్తాన్ (దుబాయ్)
మార్చి 2- న్యూజిలాండ్ (దుబాయ్)
చదవండి: 'కోహ్లి వల్లే యువీ ముందుగా రిటైరయ్యాడు'.. ఉతప్ప సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment