Photo: IPL Twitter
టీమిండియా స్టార్... లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ వైఫల్యం కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఒక్క మ్యాచ్ మినహా మళ్లీ రాహుల్ కథ మొదటికే వచ్చింది. అయితే జాతీయ జట్టు తరపున ఆడకున్నా ఐపీఎల్‌లో మాత్రం దుమ్మురేపుతాడని అభిమానులు ట్రోల్ చేసేవారు. అయితే ఇకపై రాహుల్‌ను ట్రోల్ చేయడం ఆపేయాల్సిందే. ఐపీఎల్‌కు మాత్రమే పనికొస్తాడనే ప్రచారం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది.
ఎందుకంటే కేఎల్ రాహుల్.. ఐపీఎల్ అయినా టీమిండియా అయినా తన ఆటతీరులో ఏ మార్పు ఉండదని మరోసారి చూపించాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 12 బంతులెదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. చేతన్ సకారియా బౌలింగ్‌లో స్లో బంతిని ఆడబోయి స్క్వేర్‌లెగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. అంతే రాహుల్ కథ ముగిసింది. వాస్తవానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్ కాస్త మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ ఇక్కడ మాత్రం ఓపెనర్‌గా వచ్చేశాడు. తనకు ఓపెనింగ్ కంటే ఐదో స్థానం కరెక్ట్ అని రాహుల్ భావించి వచ్చే మ్యాచ్‌ల నుంచి ఐదో స్థానంలో వస్తే మంచిది.
ఇక రాహుల్ తక్కువ స్కోరుకే వెనుతిరగడంపై అభిమానులు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ఎక్కడైనా రాహుల్ ఆటతీరు ఇంతే.. అతన్ని తిట్టడం, ట్రోల్ చేయడం ఆపండి.. 12 బంతుల్లో 8 పరుగులు... పొరపాటున టెస్టు మ్యాచ్ అనుకోలేదు కదా రాహుల్.. ఓపెనర్ వద్దు.. ఐదో స్థానమే నీకు ముద్దు.. అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment