
వైరల్ అవుతున్న శిల్పా ఫొటో
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ఆమెకు సంబంధించిన ఓ ఫొటోపై అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. కొడుకు వియాన్‌తో కలిసి నడుస్తున్నట్లు ఉన్న ఆ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లోహల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో శిల్పాశెట్టి కుర్తా ధరించి దానికి సంబంధించిన ఫ్యాంట్ వేసుకోలేదో లేక ఆ డ్రెస్సే అలాంటిదేమో తెలియదు కానీ.. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ‘శిల్పాజీ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారా..’ అని, ‘ఆంటీ.. మీరు ఒక కొడుకుకు తల్లి అనే విషయం గుర్తుందా’ అనే ఘాటు వ్యాఖ్యలతో ట్రోల్ చేస్తున్నారు.
ఇక ఈ బాలీవుడ్ బ్యూటీకి ఈ ట్రోలింగ్ కొత్తేమికాదు. గతంతో కూడా ఆమె వేషధారణ సంబంధించి అనేకసార్లు విమర్శలపాలయ్యారు. ఇటీవల సరదగా చేసిన పనికి కూడా ఆమెను నెటిజన్లు తిట్లతో ఏకిపారేశారు. సరదాగా టార్చరింగ్ ఫిష్ అంటూ ఆమె చేసిన పోస్ట్‌కు విమర్శలు వెల్లువెత్తాయి. జంతు సంరక్షణ సంస్థ పెటా ప్రచారకర్తవై ఇలాంటి పనులేంటని మండిపడ్డారు. వాటన్నిటికి ఆమె గట్టిగానే బదులిచ్చారు కూడా. అయితే తాజాగా ట్రోల్ అవుతున్న ఫొటో ఎవరు షేర్ చేశారో అనేది మాత్రం స్పష్టతలేకపోయినప్పటికి ఆమెకు మద్దతు నిలిచేవారు కూడా ఉన్నారు. ఆమె ఏ దుస్తులు ధరించాలో కూడా మీరే నిర్ణయిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment