అనుష్కశర్మపై కుళ్లు జోకులు! | Anushka Sharma Memes Are Breaking the Internet | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 15 2018 12:31 PM | Last Updated on Mon, Oct 22 2018 6:13 PM

Anushka Sharma Memes Are Breaking the Internet - Sakshi

వైరల్‌ అవుతున్న అనుష్క ఫొటో

బాలీవుడ్ చాక్లెట్ బాయ్ వరుణ్ ధావన్, బ్యూటి క్వీన్ అనుష్క శర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘సూయి ధాగా’. ఈ సినిమా ట్రైలర్‌ సోమవారం విడుదల అయిన విషయం తెలిసిందే. .‘మేడ్‌ ఇన్‌ ఇండియా’ స్ఫూర్తితో తెరకెక్కిన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. విదేశీ ఉత్పత్పులు వద్దని జాతిపిత మహాత్మా గాంధీ చరకా ద్వారా ఖాదీ వస్త్రాలను రూపొందించిన అంశాలను ప్రస్తావిస్తూ భారతీయ వస్త్ర పరిశ్రమ గొప్పతనాన్ని చాటి చెప్పే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌లో అనుష్క డిగ్లామర్‌ పాత్రలో తన అమాయకత్వపు నటనతో ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సబంధించిన ఓ ఫొటో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఓ సన్నివేశంలో అనుష్కశర్మ భావోద్వేగానికి లోనైనా ఫొటోకు క్యాప్షన్‌గా నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. ఐదో సారికి పరీక్షల్లో పాసైతే ఉండే తల్లి రియాక్షన్‌ అని, ముంబై లోకల్‌ ట్రైన్‌లో కిటికీ వద్ద సీటు లభిస్తే కలిగే ఆనందమని కామెంట్‌ చేస్తున్నారు. ఒకరు పరీక్షా ప్రశ్నపత్రం అత్యంత సులువుగా వచ్చి.. మరో ఆన్సర్‌ షీట్‌ అడుగుతున్నప్పుడు కలిగే భావోద్వేగమని సెటైర్‌ వేస్తున్నారు. కెప్టెన్‌ కోహ్లి డీఆర్‌ఎస్‌ విజయవంతమైనపుడు అనుష్క కలిగే ఆనందమని మరొకరు అభిప్రాయపడ్డారు. ఇలా నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతుండటంతో ఈ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఒక్క ఫొటోనే కాకుండా ఈ మూవీకి సంబంధించిన మరిన్నీ ఫొటోలపై సైతం నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. శరత్‌ కటారియా దర్శకత్వంలో యశ్‌రాజ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడండి: సూయి ధాగా ట్రైలర్‌ )  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement