బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ తన భర్త టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లితో కలిసి స్విట్జర్‌లాండ్‌లో సందడి చేస్తున్నారు. న్యూ ఇయర్ వెకేషన్‌లో భాగంగా విరుష్కలు మంచు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. హీరో వరుణ్ ధావన్, అతడి ప్రియురాలు నటాషా దలాల్‌తో కలిసి స్విట్జర్‌లాండ్‌లో చక్కర్లు కొడుతున్నారు. హాలీడే ట్రిప్‌లో భర్త విరాట్‌తో కలిసి తీసుకున్న ఫోటోలను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో వీరి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చల్లని మంచు ప్రదేశంలో పూర్తిగా వెచ్చని దుస్తులు ధరించి అనుష్క గోడకు వాలి దీర్ఘంగా ఆలోచిస్తున్న ఫోటోకి ‘ 2020 కోసం ఎదురుచూస్తూ..’ అనే క్యాప్షన్‌ను జత చేసి షేర్ చేశారు.
అలాగే విరాట్, వరుణ్, నటాషా దాలాల్‌తో కలిసి తీసుకున్న గ్రూప్ ఫోటోలను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు అనుష్క. వీటితో పాటు స్విట్జర్లాండ్‌లోని కొన్ని అందమైన ప్రదేశాల ఫోటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం హలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్న అనుష్క ఈ ఏడాది ఒకటి రెండు సినిమాలలో మాత్రమే కనిపించారు. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్‌తో కలిసి ‘జీరో’, వరుణ్ ధావన్‌తో కలిసి ‘సూయ్ దాగ’ సినిమాలలో మాత్రమే నటించారు. జీరో సినిమా ప్లాప్‌తో సినిమాలకు విరామం ఇచ్చిన ఈ బ్యూటీ వచ్చే ఏడాది 2020లోని పలు సినిమా ప్రాజెక్టులకు సైన్ చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment