బేబీ బంప్‌తో అనుష్క.. మరోసారి తండ్రి కాబోతున్న విరాట్‌ | Virat Kohli Wife Anushka Sharma Gets Spotted With Baby Bump Amid Pregnancy Rumours, Video Viral - Sakshi
Sakshi News home page

Anushka Sharma Pregnant: బేబీ బంప్‌తో అనుష్క.. మరోసారి తండ్రి కాబోతున్న విరాట్‌

Published Fri, Nov 10 2023 12:32 PM | Last Updated on Fri, Nov 10 2023 1:01 PM

Anushka Sharma And Virat Kohli Get Second Child News Viral - Sakshi

బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్‌ విరాట్ కోహ్లి దంపతులు మరోబిడ్డకు జన్మనివబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వారిద్దరూ తమ రెండవ బిడ్డ గురించి అసలు విషయం రివీల్‌ చేస్తారని చాలారోజుల నుంచి వారి అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ వారు ఇప్పటి వరకు అధికారికంగా ఆ విషయంపై ఎక్కడా ప్రకటించలేదు. ప్రస్తుతం ఇండియాలో క్రికెట్‌ వరల్డ్‌ కప్‌- 2023 జరుగుతున్న విషయం తెలిసిందే.

(ఇదీ చదవండి: ఆదిపురుష్‌కు పని చేయడమే నేను చేసిన పెద్ద తప్పు: రచయిత)

తాజాగా అనుష్క తన భర్త విరాట్‌తో కలిసి ఒక హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. అనుష్క తన బేబీ బంప్‌పై చేతులు ఉంచి నడుస్తూ ఉన్నారు. అందులో ఆమె బేబీ బంప్‌ చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో భారీగా వైరల్‌ అవుతుంది. దీంతో విరాట్‌- అనుష్క అభిమానులు దానిని షేర్‌ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఈ జంట ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్‌కు వెళ్లారు. ఎందుకు వచ్చామనే విషయంపై త్వరలోనే ప్రకటన చేస్తామని చెప్పి ఫొటోలు తీయొద్దని కోహ్లి మీడియాను అభ్యర్థించారు.

ఆ సమయం నుంచి ఈ వార్తలు ప్రచారంలోనే ఉన్నాయి. తాజాగా అనుష్కకు సంబంధించిన వీడియోలో బేబీ బంప్‌ చాలా క్లియర్‌గా కనిపించడంతో ఆమె మరోసారి ప్రెగ్నెంట్‌ అని తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఛోటా విరాట్‌ రాబోతున్నాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా గతంలో వచ్చిన పుకార్లన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పడినట్లుగా తెలుస్తోంది. వరల్డ్‌ కప్‌ పూర్తి అయిన తర్వాత ఈ విషయంపై విరాట్‌ ప్రకటించే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతానికి ఈ విషయంపై విరుష్క జంట ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వారికి 2021లో వామిక జన్మించిన విషయం తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement