Eng Tour Of WI: England Announces 16 Members Squad For West Indies Series - Sakshi
Sakshi News home page

England Squad For West Indies Series: 16 మంది సభ్యులతో కూడిన జట్టు ప్రకటించిన ఇంగ్లండ్‌.. ఇద్దరు కొత్త ఆటగాళ్లు

Published Thu, Dec 23 2021 6:13 PM | Last Updated on Fri, Dec 24 2021 7:55 AM

Eng Vs WI T20 Series: England 16 Member Squad David Payne Picked Details - Sakshi

PC: ICC

England Tour OF West Indies- T20 Series Squad:  వచ్చే ఏడాది ఆరంభంలో వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో ఇంగ్లండ్‌ తమ జట్టును ప్రకటించింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. ఇందులో లెఫ్టార్మ్‌ సీమర్‌ డేవిడ్‌ పైన్‌, జార్జ్‌  గార్టన్‌లకు చోటు దక్కింది. విండీస్‌ టూర్‌ సందర్భంగా వీరు ఇంగ్లండ్‌ తరఫున అరంగేట్రం చేయనున్నారు. ఇక ఈ సిరీస్‌కు పాల్‌ కోలింగ్‌వుడ్‌ తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. మార్కస్‌ ట్రెస్కోథిక్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా విధులు నిర్వర్తించనున్నాడు. 

ఈ విషయం గురించి కోలింగ్‌వుడ్‌ మాట్లాడుతూ... ‘‘పటిష్టమైన జట్టును ఎంపిక చేశాం. ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీని దృష్టిలో పెట్టుకుని బ్యాటింగ్‌.. బౌలింగ్‌ విభాగాన్ని సమతుల్యం చేసుకుంటూ ఆటగాళ్లను సెలక్ట్‌ చేశాం’’అని చెప్పుకొచ్చాడు. కాగా విండీస్‌ టూర్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో 11 మంది టీ20 ప్రపంచకప్‌-2021 ఈవెంట్‌లో పాల్గొన్న ఆటగాళ్లు ఉండటం గమనార్హం. 

వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌ ప్రకటించిన జట్టు:
ఇయాన్‌ మోర్గాన్‌(కెప్టెన్‌), మొయిన్‌ అలీ, టామ్‌ బాంటన్‌, సామ్‌ బిల్లింగ్స్‌, లియామ్‌ డాసన్‌, జార్జ్‌  గార్టన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, సకీబ్‌ మహమూద్‌, టైమల్‌ మిల్స్‌, డేవిడ్‌ పైన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌ రాయ్‌, ఫిల్‌ సాల్ట్‌, రీస్‌ టోప్లే, జేమ్స్‌ విన్సే.

ఇంగ్లండ్‌ వర్సెస్‌ వెస్టిండీస్‌- టీ20 సిరీస్‌- షెడ్యూల్‌:
తొలి మ్యాచ్‌- జనవరి 22
రెండో మ్యాచ్‌- జనవరి 23
మూడో మ్యాచ్‌- జనవరి 26
నాలుగో మ్యాచ్‌- జనవరి 29
ఐదో మ్యాచ్‌- జనవరి 30.

చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌, కెప్టెన్సీ చేయండి.. అప్పుడే కప్‌ గెలుస్తారు! రోహిత్‌.. ఇంకా కోహ్లి...
Justin Langer: మూడు ఫార్మాట్లలో కొనసాగుతా.. ఐసీసీ ట్రోఫీలు గెలవడమే లక్ష్యం: హెడ్‌కోచ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement