Australian Media Called Ashwin Cheater.. మోర్గాన్- అశ్విన్ వివాదం చోటుచోటుచేసుకొని రెండు రోజులు కావొస్తున్నా.. ఇప్పటికీ విమర్శనాస్త్రాలు వస్తూనే ఉన్నాయి. కొందరు మోర్గాన్‌ది తప్పు అంటే.. మరికొందరు అశ్విన్‌కు మద్దతు పలుకుతూ మాట్లాడారు. తాజాగా ఆసీస్ మీడియా మోర్గాన్‌కు సపోర్ట్ చేస్తే.. అశ్విన్ ఒక చీటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మోర్గాన్‌పై అసహనం వ్యక్తం చేస్తూ అశ్విన్ ప్రదర్శించిన తీరు క్రీడాస్పూర్తిని దెబ్బతీసిందని అభిప్రాయపడింది. అశ్విన్ ప్రవర్తన మాకు ఆశ్చర్యం కలిగించిందని.. అతను చేసింది ముమ్మాటికి తప్పేనని తెలిపింది. ఆసీస్ మాజీ క్రికెటర్ షేన్ వార్న్.. ''మోర్గాన్‌కు అశ్విన్‌ను అడ్డుకునే హక్కు ఉంది'' అని చేసిన వ్యాఖ్యలను మేము సమర్థిస్తున్నాం. ఘటన జరిగిన రెండు రోజులకు అశ్విన్ స్పందించడం హాస్యాస్పదం. అని చెప్పుకొచ్చింది.
చదవండి: Ashwin Vs Morgan: మోర్గాన్ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు
కాగా సెప్టెంబరు 28న కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా సౌథీ, అశ్విన్‌ల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ గొడవలో కెప్టెన్ మోర్గాన్ దూరి సౌథీకి మద్దతు పలికాడు. దీంతో ఆశ్విన్ మోర్గాన్‌కు బ్యాట్ చూపిస్తూ సీరియస్‌గా కనిపించాడు. అంతలో.. వికెట్ కీపర్ దినేశ్ కార్తిక్ జోక్యం చేసుకోవడంతో అక్కడితో వివాదం సద్దుమణిగింది. అయితే, ఆ తర్వాత దినేశ్ కార్తిక్ మాట్లాడుతూ.. బాల్ పంత్‌ను తాకిన తర్వాత కూడా అశ్విన్ పరుగు తీయడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమనే ఉద్దేశంలో మోర్గాన్ అలా స్పందించి ఉంటాడని అభిప్రాయపడ్డాడు.
చదవండి: Virender Sehwag: మిస్టర్ మోర్గాన్.. లార్డ్స్ బయట ధర్నా చేయాల్సింది
Comments
Please login to add a commentAdd a comment